
లక్నో: బూతు పుస్తకాలు, గుట్కా ప్యాకెట్లు, సిగరెట్లు, లైటర్లు, బ్లేడ్, రేజర్, ట్రిమ్మర్, ఐపాడ్, మొబైల్ ఫోన్లు... ఇవన్నీ పిల్లల స్కూలు బ్యాగుల్లోని వస్తువులు. లక్నోలోని పలు ప్రైవేటు స్కూళ్లలో నిర్వహించిన తనిఖీల్లో ఈ వస్తువులు బయటపడడంతో టీచర్లు అవాక్కయ్యారు.
నగరంలోని బ్రైట్‌ల్యాండ్ స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థిపై సీనియర్ విద్యార్థిని కత్తితో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు స్కూళ్లలో తనిఖీలు నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో బూతు పుస్తకాలు ఉండడం చూసి షాకయ్యామని ఒక టీచర్ తెలిపారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు బూతు పుస్తకాలకు సైన్సు అట్టలు వేసి తీసుకొస్తున్నారని ఆమె చెప్పారు. స్కూలు విద్యార్థుల నుంచి ఆ వస్తువుల్ని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేశామని స్కూలు యాజమాన్యం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment