పోర్న్‌ స్టార్‌ వీడియోకు కీరవాణి మ్యూజిక్‌ | Keeravani Music for varma god sex truth | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 16 2018 10:33 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

Keeravani Music for varma god sex truth - Sakshi

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోర్న్ స్టార్‌ మియా మాల్కోవాతో ఓ వీడియోను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకింగ్‌ స్టిల్స్‌తో సంచలనం సృష్టించిన వర్మ, తాజాగా ఈ వీడియోకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. పూర్తి వీడియోను రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు వర్మ. తాజాగా ఈ వీడియోకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు రామ్ గోపాల్‌ వర్మ.

గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌ పేరుతో రూపొందిస్తున్న ఈ వీడియోకు సీనియర్‌ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతమందించారు. గతంలో వర్మ దర్శకత్వంలో రూపొందిన క్షణ క్షణం సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. దాదాపు 25 ఏళ్ల తరువాత వర్మ ఓ పోర్న్‌ స్టార్ తో రూపొందిస్తున్న ప్రాజెక్ట్‌ కోసం కీరవాణితో కలిసి పనిచేసినట్టుగా వెళ్లడించారు. ప్రస్తుతం వర్మ నాగార్జున హీరోగా ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ ను తెరకెక్కిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement