బిల్‌బోర్డులో ఆ క్లిప్‌ చూసి బిత్తరపోయారు! | Accidental display of porn clips on digital billboards | Sakshi
Sakshi News home page

బిల్‌బోర్డులో ఆ క్లిప్‌ చూసి బిత్తరపోయారు!

Published Sat, Aug 27 2016 3:46 PM | Last Updated on Tue, Sep 18 2018 7:50 PM

బిల్‌బోర్డులో ఆ క్లిప్‌ చూసి బిత్తరపోయారు! - Sakshi

బిల్‌బోర్డులో ఆ క్లిప్‌ చూసి బిత్తరపోయారు!

పుణె: బహిరంగ ప్రదేశాల్లో వాణిజ్య ప్రకటనల ప్రసారం కోసం డిజిటల్‌ బిల్‌ బోర్డులను ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తోపాటు దేశంలోని చాలా నగరాల్లో ఇలాంటి బిల్‌బోర్డుల్లో నిత్యం ప్రకటనలను ప్రసారం చేస్తుంటారు. కానీ, తాజాగా పుణెలో ఓ డిజిటల్‌ బిల్‌బోర్డులోని ప్రకటన చూసి వాహనదారులు, ప్రజలు బిత్తరపోయారు. అందులో కనిపించిన దృశ్యాలతో వారికి మతిపోయినంత పనైంది. దీంతో పుణెలోని కర్వెలో రోడ్డులో శుక్రవారం కొంతసేపు ట్రాఫిక్‌ జామైంది.

ఇంతకూ ఓ బిల్‌బోర్డులో ఏం చూపించారంటే.. ఓ పోర్న్‌ వెబ్‌సైట్‌ కు చెందిన క్లిప్పును ప్రదర్శించారు. అనుకోకుండా బిల్‌బోర్డు వైపు చూసిన ప్రజలు.. అందులో వస్తున్న పోర్న్‌ క్లిప్‌ ను చూసి విస్తుపోయారు. అందరూ అటే దృష్టి సారించడంతో ఒక్కసారిగా అక్కడ కొంతసేపు ట్రాఫిక్‌ జామైంది. ముంబైకర్‌ పేరిట ఓ మహిళ.. సదరు బాగోతాన్ని ప్రదర్శిస్తున్న ఆ బిల్డ్‌బోర్డు ఫొటో తీసి ట్విట్టర్‌లో పెట్టింది. ఇలాంటి ఘటన గత ఏడాది కేరళలో కూడా జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసే డిజిటల్‌ బిల్‌ బోర్డుల్లో ఈ ఆగడాలేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement