digital billboards
-
చిన్న మార్పు.. ఆ రైల్వేకు అధిక ఆదాయం తెచ్చిపెడుతోంది..
సెంట్రల్ రైల్వే పరిధిలోని ఓ రైల్వే డివిజన్ చేసిన మార్పు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. వివిధ మార్గాల్లో ఆదాయ పెంపుపై దృష్టి పెట్టిన సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్ తమ పరిధిలోని ప్రకటన హోర్డింగ్‌లను డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చడం ప్రారంభించింది. మొత్తం ఏడు హోర్డింగ్‌లను ఎల్ఈడీ డిస్ప్లే, డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చింది. దీంతో వార్షిక లైసెన్సు ఫీజులు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చిన ఈ హోర్డింగ్‌ల ద్వారా సంవత్సరానికి రూ.1.53 కోట్ల అదనపు ఆదాయం ముంబై రైల్వే డివిజన్‌కు వచ్చింది. కుర్లా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ తూర్పు వైపు, సియోన్ ఆర్ఓబీ (రెండు బోర్డులు), కంజుర్మార్గ్ రోడ్ ఆర్ఓబీ, తిలక్ నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్, సుమన్ నగర్ ఆర్యూబీ గాంట్రీ సైట్ సీ, థానే-కోప్రి ఆర్ఓబీ వద్ద ఈ డిజిటల్ ప్రకటన బోర్డులు ఉన్నాయి. ప్రకటనదారులు సాధారణ లైసెన్స్ రుసుము కంటే 1.5 రెట్లు అధికంగా చెల్లించి ఇప్పటికే ఉన్న స్టాటిక్ హోర్డింగ్‌లను ఆకర్షణీయమైన డిజిటల్ డిస్ప్లే బోర్డులుగా మార్చుకోవచ్చు. కాగా మరో నాలుగు హోర్డింగ్‌లను డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చే ప్రక్రియలో ముంబై రైల్వే డివిజన్ ఉంది. -
బిల్‌బోర్డులో ఆ క్లిప్ చూసి బిత్తరపోయారు!
పుణె: బహిరంగ ప్రదేశాల్లో వాణిజ్య ప్రకటనల ప్రసారం కోసం డిజిటల్ బిల్ బోర్డులను ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తోపాటు దేశంలోని చాలా నగరాల్లో ఇలాంటి బిల్‌బోర్డుల్లో నిత్యం ప్రకటనలను ప్రసారం చేస్తుంటారు. కానీ, తాజాగా పుణెలో ఓ డిజిటల్ బిల్బోర్డులోని ప్రకటన చూసి వాహనదారులు, ప్రజలు బిత్తరపోయారు. అందులో కనిపించిన దృశ్యాలతో వారికి మతిపోయినంత పనైంది. దీంతో పుణెలోని కర్వెలో రోడ్డులో శుక్రవారం కొంతసేపు ట్రాఫిక్ జామైంది. ఇంతకూ ఓ బిల్‌బోర్డులో ఏం చూపించారంటే.. ఓ పోర్న్ వెబ్సైట్ కు చెందిన క్లిప్పును ప్రదర్శించారు. అనుకోకుండా బిల్‌బోర్డు వైపు చూసిన ప్రజలు.. అందులో వస్తున్న పోర్న్ క్లిప్ ను చూసి విస్తుపోయారు. అందరూ అటే దృష్టి సారించడంతో ఒక్కసారిగా అక్కడ కొంతసేపు ట్రాఫిక్ జామైంది. ముంబైకర్ పేరిట ఓ మహిళ.. సదరు బాగోతాన్ని ప్రదర్శిస్తున్న ఆ బిల్డ్బోర్డు ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టింది. ఇలాంటి ఘటన గత ఏడాది కేరళలో కూడా జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసే డిజిటల్ బిల్ బోర్డుల్లో ఈ ఆగడాలేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.