సినిమా హీరోయిన్లు, ఇతర నటీమణుల ఫొటోలు, వీడియోలకు అసభ్యపదజాలాన్ని జోడించి అశ్లీలతను ఎగజిమ్ముతోన్న దాసరి ప్రదీప్ పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరు కేంద్రంగా నాలుగు అశ్లీల వెబ్‌సైట్లు నిర్వహిస్తోన్న ప్రదీప్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆదివారం హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడిని రేపు(సోమవారం) కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు