ఎవరి పోర్న్ వీడియోలు ఎక్కువ చూస్తున్నారు? | this is how indians are hooked to porn, survey reveals | Sakshi
Sakshi News home page

ఎవరి పోర్న్ వీడియోలు ఎక్కువ చూస్తున్నారు?

Published Sun, Feb 28 2016 4:12 PM | Last Updated on Tue, Sep 18 2018 7:50 PM

ఎవరి పోర్న్ వీడియోలు ఎక్కువ చూస్తున్నారు? - Sakshi

ఎవరి పోర్న్ వీడియోలు ఎక్కువ చూస్తున్నారు?

పోర్నోగ్రఫీ వలలో చిక్కుకున్న భారతీయులు ఆ వ్యసనానికి ఎంతలా బానిసలయ్యారో, ఏయే రోజుల్లో వాటిని ఎక్కువగా చూస్తున్నారో, సన్నీ లియోన్ తర్వాత ఎవరి వీడియోలను అధికంగా చూస్తున్నారో గణాంకాలతోకూడిన ముఖ్యాంశాలను పరిశీలిద్దాం..

  • ఆన్ లైన్ లో నీలిచిత్రాలు చూడటంలో భారత్ ది ప్రపంచంలో ఐదో ర్యాంకు.
  • పోర్న్ చూసేవారిలో ఉత్తర భారతీయులే అధికం.
  • అడల్ట్ సైట్లు చూసేందుకు భారతీయులు వెచ్చిస్తున్న కాలం రమారమి 8.22 నిమిషాలు. ప్రపంచ సగటు(8.56 నిమిషాలకు) దగ్గరగా ఉన్నాం మనం.
  • యావరేజ్ పేజ్ యాక్సెస్ పర్ విజిట్ 7.32. ప్రపంచ వ్యాప్తంగా 7.60.
  • మొబైల్ ఫోన్ - 49.9 శాతం మంది, డెస్క్ టాప్ ద్వారా 47.5 శాతం మంది, టాబ్లెట్ ద్వారా 2.6 శాతం మంది పోర్న్ ను వీక్షిస్తున్నారు.
  • శనివారాల్లో అత్యధికులు అశ్లీల వెబ్ సైట్లను చూస్తుండగా, ఆదివారాల్లో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది.
  • మే నెలలో పోర్న్ వీడియోల వీక్షణ గణనీయంగా పెరుగుతుండగా, అక్టోబర్ మాసంలో చాలా తక్కువగా ఉంటోంది.
  • రాఖీ పౌర్ణమి, జాతీయపండుగల సెలవుల్లోనూ పోర్న్ వీక్షణం ఎక్కువ. దివాలీ, దసరా, న్యూఇయర్, గాంధీజయంతి నాడు తక్కువ.
  • నీలి చిత్రాలు చూసే భారతీయుల్లో అత్యధికులు ఇష్టపడే శృంగార తార సన్నీ లియోన్ కాగా తర్వాతి స్థానాల్లో లిసా ఆనే, ప్రియా రాయ్ లు ఉన్నారు.
  • పోర్న్ హబ్ డాట్ కామ్ అనే సంస్థ 2013-14 మధ్యకాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించారు

ఈ వార్తల నేపథ్యంలో పౌరుల విశృంఖలత్వానికి కారణమవుతోన్న పోర్నోగ్రఫీ(నీలిచిత్రాలు)పై అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వెళ్లగక్కింది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ (పిల్లల నీలిచిత్రాలు) నిషేధించేందుకు అవసరమైన అన్ని మార్గాలను సూచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు జాతీయ మహిళా కమిషన్, ఆయారంగాల్లోని నిపుణుల సలహాలు తీసుకుని చైల్డ్ పోర్నోగ్రఫీని నివారించే మార్గాలపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తిసింగ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.

అయితే పోర్నోగ్రఫీని నిషేధించడం సాధ్యంకాదని, ఆ అంశం దేశచట్టాల పరిధిలో లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. దీనిపై ధర్మాసనం.. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో దేశాన్ని ప్రయోగశాలగా మార్చేందుకు అనుమతివ్వబోమని తీవ్రంగా స్పందించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ విచారకరమైన అంశమని, ప్రజలు చూడదగినవి ఏవో, చూడకూడనివి ఏవో స్పష్టత ఉండాల్సిందేనని పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement