మా భర్తలు పోర్న్‌కు బానిసలు అయ్యారు | ban on pornography, women requests Supreme Court | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 15 2018 9:54 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

ban on pornography, women requests Supreme Court - Sakshi

నా భర్త పోర్న్‌ వీడియోలకు తీవ్ర బానిసగా మారాయడు. అశ్లీల వీడియోలు చూస్తూ అతను నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో మా వైవాహిక బంధం చిక్కుల్లో పడింది.
- కోలకతాకు  చెందిన ఓ 27 ఏళ్ల మహిళ ఆవేదన..

ఇంటర్నెట్‌లో పోర్న్‌ వీడియోలు పదేపదే చూస్తూ నా భర్త వికృతంగా మారిపోయాడు. రోజువారీ వ్యవహారాలు కూడా అతను విస్మరించి బూతులు వీడియోలు చూస్తున్నాడు. దీంతో మా బంధం నాశనమైంది. నా శారీరక, వ్యక్తిగత అవసరాలను కూడా అతను పట్టించుకోవడం లేదు.
ఇది ఒక ముంబై మహిళ ఆవేదన

ఇలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమ భాగస్వాములు పోర్న్‌ వీడియోలకు బానిసలుగా మారారని, పోర్న్‌ వెబ్‌సైట్లపై సంపూర్ణ నిషేధం విధించి.. తమ వైవాహిక జీవితాలను కాపాడాలని వారు న్యాయస్థానానికి మొరపెట్టుకుంటున్నారు. 2013లో ఆన్‌లైన్‌ పోర్న్‌గ్రఫీపై నిషేధం విధించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ పిల్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు విడతల వారీగా ఆదేశాలు వెలువరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యంలో పార్టీగా చేరేందుకు బాధితులు అనేకమంది ముందుకువస్తున్నారు.

‘పోర్న్‌ వీడియోలకు బానిస అయిన నా భర్త పరస్పర సమ్మతితో విడాకులు తీసుకుందామని నాపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ మేరకు అతను ఫ్యామిలీ కోర్టును సైతం ఆశ్రయించాడు. అతనిలో లైంగిక శక్తి తగ్గిపోయింది. నాతో లైంగికంగా గడపడానికి కూడా ఒప్పుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో అసహజ శృంగారానికి పాల్పడాలని నన్ను బలవంతపెడుతున్నాడు. అతడి తీవ్ర వికృతమైన మా ప్రవర్తనతో మా వైవాహిక జీవితం నాశనమయ్యే పరిస్థితి నెలకొంది’ అని ముంబై మహిళ తన అఫిడవిట్‌లో ఆవేదన వ్యక్తం చేసింది.

స్మార్ట్‌ఫోన్ల వల్ల మిలియన్లకొద్దీ భారతీయులకు పోర్న్‌ వీడియోలు సులువుగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా తక్కువధరకు బూతు వీడియోలు మెమరీకార్డులో నింపుకునే అవకాశమూ అందుబాటులో ఉంది. దీనికితోడు ఇంటర్నెట్‌లో ఉన్న అన్ని పోర్న్‌సైట్లపై నిషేధం విధించడం అసాధ్యమని ఇంటర్నెట్‌ కంపెనీలు చెప్తున్నాయి. చాలా పోర్న్‌సైట్ల సర్వర్లు భారత్‌ బయట ఉన్నావే. అంతేకాకుండా ప్రాక్సీ సర్వర్లతో కూడా పోర్న్‌సైట్లను చూడవచ్చు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందుకు వచ్చే బాధితులు ఎట్టిపరిస్థితుల్లో పోర్న్‌ సైట్లను నిషేధించాలని అభ్యర్థిస్తున్నారు. 2017 ఫిబ్రవరిలో ఓ వివాహిత, అంతకుముందు 12వ తరగతి విద్యార్థి అకాశ్‌ నర్వాల్‌ కూడా ఇదే అభ్యర్థనతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధిక మంది ఇంటర్నెట్‌ వాడకందార్లు (45కోట్లమంది) ఉన్న దేశం భారత్‌. ఈ నేపథ్యంలో ఇప్పటికే చైల్డ్‌ పోర్న్‌ను, బాలలపై లైంగిక దాడుల వీడియోలు, ఫొటోలను అరికట్టేందుకు ఇంటర్‌పోల్‌తో కలిసి చర్యలు తీసుకుంటున్నట్టు మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో పోర్న్‌ వీడియోల వీక్షణను అరికట్టేందుకు గల సాధ్యాసాధ్యాలను సుప్రీంకోర్టు అన్వేషిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో పోర్న్‌ వీడియోలు చూడటంపై నిషేధం విధించడం, దీనిని నేరంగా పరిగణించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement