న్యూఢిల్లీ: భారత ఆర్మీ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంతోపాటు ఆరెస్సెస్ ఉండటం వల్లే భారతీయులు సురక్షితంగా ఉన్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పేర్కొన్నారు. కొట్టాయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రచారక్‌ల శిక్షణ కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీ థామస్ మాట్లాడారు. శారీరక దారుఢ్యం కోసం ఆరెస్సెస్ కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని, దాడుల నుంచి దేశాన్ని, సమాజాన్ని కాపాడటానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు.
'భారత్‌లో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారంటే అందుకు కారణం రాజ్యాంగం ఉండటం, ప్రజాస్వామ్యం ఉండటం, భద్రతా దళాలు ఉండటం, నాలుగోది ఆరెస్సెస్ ఉండటం వల్ల అని నేను అంటాను' అని కేటీ థామస్ అన్నారు. హిందు అనే పదం ప్రజల సంస్కృతి, జీవనవిధానానికి సంబంధించిందని, దీనిని ఆరెస్సెస్, బీజేపీకి పరిమితం చేసి మాట్లాడటం విచారకరమని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment