సన్నీలియోన్పై ఎఫ్ఐఆర్
ముంబయి: బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్పై ఆదివారం కేసు నమోదైంది. ఆమెతోపాటు గూగుల్ సీఈవో, ఓ బాలీవుడ్ మేగజిన్పై కూడా అజ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసభ్యత, అశ్లీలత్వంను విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. అరింజయ్ జైన్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. తాను బాలీవుడ్ మేగజిన్కు చెందిన సైట్ను ఫాలో అవుతుంటానని, ఇటీవల కాలంలో అసభ్యంగా ఉండే పలు సన్నీ లియోన్ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారని, అందులో కథనాలు కూడా అలాగే ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు సెక్షన్ 292(అసభ్యకరంగా ఉండే పుస్తకాలు అమ్మడం), పద్ధతిలేకుండా ఓ మహిళ నడుచుకోవడం(భారతీయ మహిళా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు), ఐటీ మొదలైన సెక్షన్లు ఎఫ్ఐఆర్లో నమోదుచేశారు.
గతంలో కూడా వెబ్సైట్లలోను, సోషల్ మీడియాలోను అసభ్యతను ప్రచారం చేస్తోందంటూ సన్నీ లియోన్పై మహారాష్ట్రలోని థానె నగరంలో కేసు నమోదైంది. ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 292, 292 ఎ, 294 రెడ్ విత్ 34 సెక్షన్లతో పాటు ఐటీ చట్టం, భారతీయ మహిళా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద కేసులు నమోదు చేశారు. అంజలీ పాలన్ (30) అనే గృహిణి చేసిన ఫిర్యాదుతో గతంలో ఈ కేసులు నమోదయ్యాయి. తాను ఇంటర్నెట్ చూస్తుంటే సన్నీ లియోన్కు చెందిన పలు అసభ్య చిత్రాలు, పోస్టులు కనిపించాయని ఆమె తెలిపారు. అలాగే ఆమె వెబ్సైట్ సన్నీలియోన్.కామ్ లో కూడా విపరీతమైన అసభ్య సమాచారం ఉందన్నారు.