వారణాసి : బనారస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఒకాయన కనిపెట్టిన యాప్ అశ్లీల సైట్లకు బ్రేకులు వేస్తుందంట. ఆ యాప్ ఉన్న ఫోన్లలో పోర్న్ సైట్లు ఓపెన్ చేస్తే చాలూ వాటిని బ్లాక్ చేయటమే కాదు.. వెంటనే భక్తి పాటలు మారుమోగుతాయి కూడా. సంస్కారి యాప్‌గా ఇప్పుడు ఇది ప్రాచుర్యం పొందుతోంది.
బనారస్ హిందూ యూనివర్సిటీ న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విజయనాథ్ 'హర హర మహదేవ' పేరిట దీనిని రూపొందించారు. అశ్లీల కంటెంట్ లేదా తీవ్ర హింస ఉన్న వీడియోలు, ఫోటోలు ఓపెన్ చేస్తే చాలూ ఇది పని చేస్తుందన్న మాట. ముఖ్యంగా తమ తల్లిదండ్రుల నిఘాకు దొరక్కుండా తప్పించుకుని తిరిగే పిల్లల కోసం దీనిని డెవలప్ చేసినట్లు ఆయన చెబుతున్నారు. ఈ యాప్‌కు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ఇన్‌స్టాల్ చేశాక హైడ్‌లోకి వెళ్లిపోతుంది. తద్వారా దానిని ఇన్‌స్టాల్ చేశారన్న విషయం కూడా ముందు వారు గుర్తించలేకపోతారన్నమాట.
దీనిని harharmahadev.co వెబ్‌సైట్ నుంచి ఈ వెబ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విజయనాథ్ తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్ హిందూ భక్తిపాటలను మాత్రమే ప్లే చేస్తోందని, త్వరలో ఇతర మతాల గీతాలను కూడా పొందుపరిచి యాప్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించాడు. అయితే ల్యాప్ ట్యాప్‌లు, డెస్క్ టాప్ వర్షన్‌లకు అందుబాటులో ఉన్న ఈ యాప్ అండ్రాయిడ్ ఫోన్లకు పూర్తిస్థాయిలో రావటానికి కాస్త సమయం పడుతుందని వెబ్ డెవలపర్ అంకిత్ శ్రీవాస్తవ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment