
అనారాగుప్తా ‘మచ్చ’ తొలగిందిలా
మాజీ మిస్ జమ్మూకశ్మీర్ అనారాగుప్తాకు చెందినదిగా చెప్తూ 2004లో వెలుగులోకి వచ్చి అశ్లీల వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం
మాజీ మిస్ జమ్మూకశ్మీర్ అనారాగుప్తాకు చెందినదిగా చెప్తూ 2004లో వెలుగులోకి వచ్చి అశ్లీల వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీని ఫలితంగా పోలీసులు ఆమెను అరెస్టు చేయడంతో పాటు పది రోజులు జైలుకు పంపారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, గుప్తా న్యాయస్థానంలో మొరపెట్టుకున్నారు.
దీంతో వీడియోను విశ్లేషించడం కోసం కోర్టు... హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించింది. ఆ వీడియోలో ఉన్న భంగిమల్లోనే అనారాగుప్తాకు చెందిన ఫొటోలు, వీడియోలను నిపుణులు సేకరించారు. వీటిని ‘ఫోరెన్సిక్ వీడియో అథెంటిఫికేషన్’ పద్ధతిలో కంప్యూటర్ ద్వారా సరిపోల్చి చూశారు. చివరకు ఆ అశ్లీల వీడియోలో ఉన్నది అనారాగుప్తా కాదని నిర్ధారించడంతో ఆమెపై పడిన మచ్చ తొలగిపోయింది.