
అప్‌లోడ్‌కు ముందే అడ్డుకోలేరా: సుప్రీం
న్యూఢిల్లీ: ‘అశ్లీల వీడియోలు, బూతు చిత్రాలు వెబ్‌సైట్లలోకి అప్‌లోడ్ కాకముందే వాటిని అడ్డుకునే యంత్రాంగం ఏదైనా ఉందా?’అని సుప్రీంకోర్టు మంగళవారం ఇంటర్నెట్ సరఫరాదార్ల(ఐఎస్‌పీ)ను ప్రశ్నించింది. వీడియోలు అప్‌లోడ్ కాకుండా తాము అడ్డుకోలేమనీ, అప్‌లోడ్ అయిన వీడియోలు అశ్లీలమైనవని తమ దృష్టికి వస్తే మాత్రం వాటిని వెంటనే తొలగించగలమని గూగుల్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఈ సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గూగుల్ న్యాయవాది సజన్ పూవయ్య తన వాదన వినిపిస్తూ బూతు వీడియోలను తొలగించడంలో ప్రభుత్వ నోడల్ సంస్థ తమకు సాయం చేయాలని కోరగా, ఇంటర్నెట్ సరఫరాదారులకు డబ్బు మాత్రమే కావాలనీ, సొంతంగా వారేదీ చేయరని ప్రభుత్వ న్యాయవాది అన్నారు.