
షాకింగ్: రైల్వే స్టేషన్ టీవీలో నీలి చిత్రం
న్యూఢిల్లీ: నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో రైల్వే స్టేషన్‌లోని ఓ టీవీలో పోర్న్ వీడియో ప్లే అయింది. ఇందుకు సంబంధించి ఓ ప్రయాణీకుడు పోస్టు చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో షాక్ తిన్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(డీఎమ్‌ఆర్‌సీ) ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ ఘటన ఏప్రిల్ 9న చోటు చేసుకుంది. కాగా, టీవీలో ప్లే అవుతున్న నీలి చిత్రాన్ని వీడియో తీసిన ఓ ప్రయాణికుడు సోషల్‌మీడియాలో పెట్టాడు.
ప్రయాణీకులు ఆ టీవీ ముందుగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నట్లు వీడియోలో ఉంది. మరికొందరు తమ సెల్‌ఫోన్లలో ఆ ఘటనను బంధిస్తూ కనిపించారు. కాగా, ఈ ఘటనపై డీఎమ్‌ఆర్‌సీని ప్రశ్నించగా.. కమర్షియల్ యాడ్స్ కోసం ఉద్దేశించిన టీవీ అని తెలిపారు.