తప్పతాగి యువతిని వీడియో తీస్తూ... | Man Arrested for Filming Woman in Delhi Metro | Sakshi
Sakshi News home page

తప్పతాగి యువతిని వీడియో తీస్తూ...

Published Fri, Aug 18 2017 8:03 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

తప్పతాగి యువతిని వీడియో తీస్తూ... - Sakshi

తప్పతాగి యువతిని వీడియో తీస్తూ...

ఢిల్లీ: మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న మహిళను చిత్రీకరిస్తూ.. పైగా ఏంటని ప్రశ్నించినందుకు ఆమెపైనే ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన గురువారం ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
సాఫ్ట్‌ వేర్ కంపెనీలో పనిచేసే యువతి(25) నోయిడా సెక్టార్ 16 నుంచి అక్షర్‌ధామ్‌ వెళ్లేందుకు మెట్రో ట్రెయిన్‌ ఎక్కింది. సుమారు 40 ఏళ్లున్న ఓ వ్యక్తి ఆమెను తన సెల్‌ ఫోన్‌ లో వీడియో తీయటం ప్రారంభించాడు. అది గమనించిన యువతి అతని చేతిలో ఫోన్ లాక్కునేందుకు యత్నించగా,  ఊగిపోతూ ఆమెపై దాడి చేశాడు. అయితే తోటి ప్రయాణికుల సాయంతో అతన్ని అదుపు చేసిన యువతి ఘటనపై యుమున బ్యాంక్‌ డిపో మెట్రో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 
 
నిందితుడిని బీహార్‌ లోని బెగుసరైకు చెందిన కుమార్ గా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. "పొగాకు ఉత్పత్తులను అమ్ముకునే కుమార్‌ తన బంధువులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చాడు. ఘటన సమయంలో అతను బాగా తాగి ఉన్నాడ"ని డీసీపీ పంకజ్‌కుమార్ సింగ్ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement