లాస్‌ఏంజెల్స్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోర్న్‌స్టార్ దావా వేసింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు తమ మధ్య ఉన్న సంబంధాలను బహిర్గతం చేయరాదన్న (నాన్‌డిస్‌క్లోజర్) ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయమూర్తిని కోరింది. లాస్‌ఏంజెల్స్‌లో బుధవారం దాఖలు చేసిన దావాలో ఈ ఒప్పందంపై ట్రంప్ స్వయంగా సంతకం చేయనందున ఇది చెల్లుబాటు కాదని ఆమె వాదించింది. పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్ తాను ట్రంప్‌తో ఒకసారి లైంగికంగా కలిశానని, ఏడాది పాటు తాము సన్నిహితంగా ఉన్నా తమ మధ్య శారీరక సంబంధం లేదని తెలిపింది.
అయితే ఒప్పందం ప్రకారం పోర్న్‌స్టార్‌కు ట్రంప్ 1,30,000 డాలర్లు చెల్లించారని, ఆమెతో ఆయనకు ఎప్పుడూ ఎఫైర్ లేదని ట్రంప్ న్యాయవాది మైఖేల్ కొహెన్ చెప్పారు. మరోవైపు ట్రంప్‌తో సంబంధాలపై తనను నోరు మెదపకుండా ఆయన న్యాయవాది కోహెన్ ఒత్తిడి చేస్తున్నారని పోర్న్‌స్టార్ న్యాయమూర్తికి నివేదించారు. పలువురు మహిళలతో ట్రంప్ కొనసాగించిన లైంగిక సంబంధాలు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment