
ఆ సైట్లు చూసి.. నేత అడ్డంగా బుక్కయ్యారు!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి తాను చేసిన పనికి నాలుక్కరుచుకున్నారు. తాను ఇచ్చిన డాక్యుమెంట్లలో పోర్న్ సైట్లు చూసినట్లుగా ఉన్న స్క్రీన్ షాట్లు రావడంతో.. చేసిన పొరపాటుకు క్షమాపణ చెప్పారు. ఆ వివరాలివి... రోడ్ ఐస్‌లాండ్ రాష్ట్రానికి చెందిన నేత రామన్ పెరీజ్ ఇటీవల హౌస్ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిటీకి కొన్ని కీలక పత్రాలకు సబంధించిన డాక్యుమెంట్ల స్క్రీన్ షాట్లు అందజేశారు.
రామన్ పెరీజ్ ఇచ్చిన స్క్రీన్ షాట్ డాక్యుమెంట్లను ప్రింట్లు తీసిన క్లర్క్ కమిటీ సభ్యులకు అందజేశాడు. అయితే పెరీజ్.. టీనేజర్ల పోర్న్ సైట్లను ఇతర ట్యాబ్‌లలో ఓపెన్ చేసి అసభ్యకర వీడియోలు చూసినట్లు ఇతర నేతలు, కమిటీ సభ్యులు గమనించి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారని ఓ అధికార ప్రతినిధి లార్రీ బెర్మన్ తెలిపారు. రీసెర్చ్ చేసి నివేదిక ఇవ్వడంలో ఆయన ఏ మాత్రం ఏకాగ్రత వహించారో అర్థమవుతుందంటూ ఇతర సభ్యులు కామెంట్లు చేశారు. దీంతో ఆ నేత నవ్వులపాలయ్యారు.
చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చే యత్నం చేశారు రామన్ పెరీజ్. 'నా పొరపాటు వల్ల డాక్యుమెంట్లో అసభ్యకర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి నేను నా ఫ్రెండ్‌కు ఈ పని అప్పగించాను. అతడు చేసిన పని నాకు ఆలస్యంగా అర్థమైందంటూ' పెరీజ్ వివరణ ఇచ్చుకున్నారు. తనను క్షమించాలని కోరుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.