ఒక్కరితో వందకుపైగా పోర్న్ చిత్రాలు తీస్తూ.. | Japan's porn industry has issued a formal apology | Sakshi
Sakshi News home page

ఒక్కరితో వందకుపైగా పోర్న్ చిత్రాలు తీస్తూ..

Jun 26 2016 6:41 PM | Updated on Sep 18 2018 7:52 PM

ఒక్కరితో వందకుపైగా పోర్న్ చిత్రాలు తీస్తూ.. - Sakshi

ఒక్కరితో వందకుపైగా పోర్న్ చిత్రాలు తీస్తూ..

ముందుగా నిర్ణయించిన వాటికంటే ఎక్కువ పోర్న్ చిత్రాల్లో నటింపజేస్తూ మహిళలను తీవ్రంగా వేధిస్తున్నారని వచ్చిన ఆరోపణలకు జపాన్ పోర్న్ ఇండస్ట్రీ స్పందించింది.

టోక్యో: ముందుగా నిర్ణయించిన వాటికంటే ఎక్కువ పోర్న్ చిత్రాల్లో నటింపజేస్తూ మహిళలను తీవ్రంగా వేధిస్తున్నారని వచ్చిన ఆరోపణలకు జపాన్ పోర్న్ ఇండస్ట్రీ స్పందించింది. మున్ముందు అలాంటి పరిస్థితి లేకుండా చూస్తామని క్షమాపణలు చెప్పింది. ఈ విషయం ముందుగా తమ దృష్టికి రాకపోవడం దురదృష్టం అని పేర్కొంది. జపాన్ పోర్న్ ఇండస్ట్రీకి ది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రమోషన్ అసోసియేషన్(ఐపీపీఏ) ప్రతినిధిగా వ్యవహరిస్తుంటుంది. ఇటీవల తమను వందకు పైగా పోర్న్ చిత్రాల్లో నటింపజేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కొందరు పోర్న్‌ స్టార్స్‌ ఫిర్యాదు చేశారు.

దీనికి సంబంధించి ఓ ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఐపీపీఏ బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనందుకు బాధపడుతున్నామని చెప్పింది. జపాన్ లో పోర్న్‌ చిత్రాల్లో నటించేందుకు సినిమాల ప్రకారం కాకుండా సమయం ప్రకారం కాంట్రాక్టు చేసుకుంటారు. ఆ తర్వాత వారికి ఇష్టం ఉన్నా లేకున్నా లెక్కలేనన్ని చిత్రాల్లో నటించేలా చేసి వారి శారీరకంగా హింసిస్తారు. చాలా కాలంగా ఇది జరుగుతున్నా ఇటీవలె ఈ విషయం బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement