శృంగారం కోసం 'తపించి' పోతున్నారు
కరాచీ : శృంగారానికి సంబంధించిన సమాచారాన్ని శోధించే విషయంలో పాకిస్తాన్ అన్ని దేశాలను వెనక్కి నెట్టి టాప్లో దూసుకెళుతోంది. ఈ విషయంలో ప్రపంచం మొత్తంగా తమ వెబ్సైట్ను ఆశ్రయిస్తున్న దేశాలలో పాక్ మొదటి స్థానాన్ని ఆక్రమించిందని ప్రముఖ వెబ్సైట్ గూగుల్ వెల్లడించింది.
శృంగారంపై సమాచారం కోసం పరితపించే దేశ వాసుల జాబితాను మంగళవారం గూగుల్ ఇక్కడ విడుదల చేసింది. శృంగారంపై చిన్న సమస్య నుంచి సమగ్ర సమాచారం కోసం పాకిస్తానీయులు గూగుల్ తల్లినే ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. అలాగే ఆ తర్వాత స్థానాన్ని ఈజిప్టు ఆక్రమించిందని పేర్కొంది. ఇక ఇరాన్, మొరాకో నాలుగు,అయిదో స్థానాలను... సౌదీ అరేబియా, టర్కీ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాలలో నిలిచాయని తెలిపింది.
అయితే శృంగారానికి సంబంధించిన సమాచారాన్ని లెబనాన్, టర్కీ తప్పించి మిగిలిన అరబ్ దేశాలు నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ముస్లిం దేశాలకు చెందిన యువత గూగుల్ను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. కాగా శృంగారం కోసం గూగుల్ని ఆశ్రయిస్తున్న దేశాల జాబితాలో మొదటి ఎనిమిది దేశాల్లో ఆరు ముస్లిం దేశాలే ఉండటం గమనార్హం. అయితే జంతువుల శృంగారానికి సంబంధించిన సమాచారం కోసం ఆయా దేశాల వాసులు గుగూల్ లో శోధించారని పేర్కొంది. ఈ మేరకు 'ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' కథనాన్ని వెలువరించింది.