
ఠాకూర్ మహేశ్, బాల్‌సిన్హా
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ రేటింగ్‌తో సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు అశ్లీల వెబ్‌సైట్ల నిర్వాహకులను సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అదనపు డీజీపీ గోవింద్ తెలిపారు. గుజరాత్‌లోని మెహ్‌సనా జిల్లాకు చెందిన ఠాకూర్ మహేశ్‌కుమార్ జయంతి, ఠాకూర్ బాల్‌సిన్హాను అరెస్ట్ చేసి అహ్మదాబాద్ కోర్టులో ప్రవేశపెట్టామన్నారు.
అనంతరం ట్రాన్సిప్ వారెంట్‌పై వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చామని వెల్లడించారు. పలువురు హీరోయిన్లు, ఆర్టిస్టుల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఐదు అశ్లీల సైట్లలో నిందితులు అప్‌లోడ్ చేశారని, ఈ సైట్ల హిట్లు ఆధారంగా నెలకు రూ.35వేలు సంపాదిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుల నుంచి 4 ల్యాప్‌ట్యాప్‌లు, రెండు సెల్‌ఫోన్లు, మూడు సిమ్‌కార్డ్‌లు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని గోవింద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment