అడల్ట్ మూవీలు చేస్తానని.. ఇంట్లో చెబితే! | Porn Star Ela Darling reveals about career entry | Sakshi
Sakshi News home page

అడల్ట్ మూవీలు చేస్తానని.. ఇంట్లో చెబితే!

Published Tue, Jun 20 2017 10:46 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

అడల్ట్ మూవీలు చేస్తానని.. ఇంట్లో చెబితే! - Sakshi

అడల్ట్ మూవీలు చేస్తానని.. ఇంట్లో చెబితే!

టెక్సాస్: మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన యువతి వెంటనే ఉద్యోగంలో చేరింది. తమ కూతురు భవిష్యత్తులో మంచి హోదాలో ఉంటుందని ఆశ పడ్డారు. కానీ కొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులకు ఊహించని షాకిచ్చింది. 'పోర్న్ ప్రపంచంలో తాను రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పగానే మా పేరెంట్స్‌కు నోట మాట రాలేదు. వారు నేను జోక్ చేస్తున్నానని భావించారని' ఎనిమిదేళ్ల కిందట జరిగిన సంభాషను పోర్న్ స్టార్ ఎల డార్లింగ్ మీడియాకు వివరించింది. 'ప్రస్తుతం నా వయసు 30 ఏళ్లు. ఈ అడల్ట్ వరల్డ్‌కి పరిచయమై ఏనిమిదేళ్లు పూర్తయింది.

22 ఏళ్ల వయసులో మాస్టర్స్ పూర్తి చేసి, లైబ్రరీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. అయితే అడల్ట్ మూవీలవైపు నా మనసు మళ్లింది. నా తొలి అడల్డ్ వీడియో కోసం మేకప్ వేసుకుని సిద్ధంగా ఉన్నాను. పేరెంట్స్‌కు చెప్పకుండా ఇలా చేస్తే.. జీవితాంతం ఈ నిజాన్ని దాయాల్సి ఉంటుంది. అలా చేయడం నాకిష్టం లేదు. ఇంటికి వెళ్లి అమ్మానాన్నలతో విషయం చెప్పేశాను. పోర్నోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకుంటున్నాను. అందుకు మీ అంగీకారం కావాలని కోరగానే.. జోక్ చేశాననుకుని వాళ్లు బిగ్గరగా నవ్వేశారు. సీరియస్‌గానే ఆ కెరీర్‌లోకి అడుగుపెడుతున్నాను అని వివరించింది. మొదట షాక్ తిన్న మా పేరెంట్స్.. నా కోరికకు అడ్డు చెప్పలేదు. నేను మంచి రంగంలో వృద్ధిలోకి వస్తే చూడాలనుకున్నారు. చివరగా నీపై పూర్తి విశ్వాసం ఉంటే నువ్వు ఎంచుకున్న కెరీర్‌వైపు అడుగులు వేయాలని' సపోర్ట్ చేశారని పోర్న్‌స్టార్ ఎల డార్లింగ్ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement