ఆ 'సైట్లు' చూస్తే.. అంతే! | Browsing history can go public | Sakshi

ఆ 'సైట్లు' చూస్తే.. అంతే!

Oct 19 2015 3:10 PM | Updated on Sep 18 2018 7:50 PM

ఆ 'సైట్లు' చూస్తే.. అంతే! - Sakshi

ఆ 'సైట్లు' చూస్తే.. అంతే!

ఈ ఏడాది మీరు శృంగార వెబ్సైట్లు చూశారా? అయితే ఏయే వీడియోలు చూశారు, ఏయే పోర్న్ వెబ్సైట్లను తిరిగేశారు.. ఇలా మీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం బట్టబయలయ్యే అవకాశముంది.

ఈ ఏడాది మీరు శృంగార వెబ్సైట్లు చూశారా? అయితే ఏయే వీడియోలు చూశారు, ఏయే పోర్న్ వెబ్సైట్లను తిరిగేశారు.. ఇలా మీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం బట్టబయలయ్యే అవకాశముంది. అజ్ఞాత (ఇన్ కాగ్నిటో) మోడ్లో చూసినా..  మీ ఆన్లైన్ చరిత్ర అంతా వెలికిరానుంది. పోర్న్ వెబ్సైట్లతోపాటు ఆన్లైన్ లో మీరేం చూశారో బ్రౌజింగ్ హిస్టరీతో సహా వెల్లడయ్యే అవకాశం ఉందని సాన్ ఫ్రాన్సికోకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బ్రెట్ థామస్ వెల్లడించారు.

హ్యాకర్లు లాగ్స్ లిస్ట్ను దొంగతనంగా పొందే అవకాశముందని, దానిద్వారా యూజర్ పేరు కూడా తెలుసుకోవచ్చునని, ఈ వివరాలతో క్రాస్-రిఫరెన్స్ చేసుకొని పోర్న్ వంటి వెబ్సైట్లలో లాగిన్ అయిన వివరాలను తెలుసుకోవచ్చునని ఆయన తన బ్లాగ్లో వెల్లడించారు. చాలాపెద్ద ఎత్తున హ్యాకింగ్ కు పాల్పడితే తప్ప ఈ వివరాలు తెలుసకునే అవకాశం లేదని, అయితే భవిష్యత్లో హ్యాకర్లు ఈ వివరాల కోసం దాడులు చేయవచ్చునని తెలిపారు. కాబట్టి టెక్నో నిపుణులు ఇలాంటి లీకులు జరుగకుండా కట్టుదిట్టమైన నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని, ఇలాంటి సున్నితమైన లీకుల వల్ల ఆన్లైన్ యూజర్లలో కల్లోలం తలెత్తే అవకాశముంనదదని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement