మంత్రి మొబైల్‌లో అశ్లీల చిత్రాలు... | Minister Tanveer Sait from Times of India Minister Tanveer Sait caught watching porn during Tipu Jayanti | Sakshi
Sakshi News home page

మంత్రి మొబైల్‌లో అశ్లీల చిత్రాలు...

Published Sat, Nov 12 2016 1:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మంత్రి  మొబైల్‌లో  అశ్లీల చిత్రాలు... - Sakshi

మంత్రి మొబైల్‌లో అశ్లీల చిత్రాలు...

మంత్రి తన్వీర్ రాజీనామాకు డిమాండ్
మిన్నంటిన నిరసనలు
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జేడీఎస్ ఆందోళనలు
మరోసారి చిక్కుల్లో సిద్ధు సర్కార్ 

మంత్రి తన్వీర్ సేఠ్ వ్యవహారం  సర్కార్‌ను చిక్కుల్లో పడేసింది. రాయచూరులో టిప్పు జయంతి రోజు తన మొబైల్‌లో అశ్లీల చిత్రాలను చూస్తూ మీడియాకు దొరికిపోరుున రాష్ట్ర ప్రాథమిక శాఖమంత్రి తన్వీర్ సేఠ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నారుు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ పార్టీలు డిమాండ్ చేశారుు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అసంతృప్త నేత బీ జనార్దన పూజారి సైతం  తన్వీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. తక్షణం ఆయన అమాత్య పదవికి రాజీనామా చేయాలని మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు.


బెంగళూరు : తన్వీర్ వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తం గా ఆందోళనలు మిన్నంటాయి. విధాన సౌధలోని మంత్రి తన్వీర్‌సేఠ్ కార్యాలయానికి తాళం వేసి జేడీఎస్ నాయకులు శుక్రవారం నిరసనకు దిగారు. ఆ పార్టీ సీనియర్ నేత బసరాజ హొరట్టి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన పుట్టణ్ణ, కృష్ణారెడ్డి, శరవణ  పాల్గొన్నారు. గతంలో బీజేపీకి చెందిన పలువురు నాయకులు ఏకంగా ముగ్గురు మంత్రులు నీలి చిత్రాలను చూస్తూ దొరికి పోరుున విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో అప్పుడు విపక్ష హోదాలో  ఉన్న సిద్దరామయ్య వారి రాజీనామాకు పట్టుపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏకంగా తన మంత్రి వర్గ సహచరుడు ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన తన్వీర్ సేఠ్‌ను ఎందుకు రాజీనామా చేరుుంచలేదని డిమాండ్ చేశారు. ఆయనకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. తన్వీర్ వ్యవహారంపై బీదర్, కలబుర్గి, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాల్లోని జిల్లాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో హిజ్రాలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement