ఆస్పత్రిలో పనిచేసే ఓ వ్యక్తి తన ల్యాప్‌టాప్‌లో పోర్న్ సినిమా చూస్తూ గుండెపోటుతో మరణించాడు. నార్త్ సెంట్రల్ బ్రాంక్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 48 ఏళ్ల వ్యక్తి చనిపోయి ఉండగా తోటి ఉద్యోగులు గమనించారు. ఆ సమయానికి అతడు పూర్తి నగ్నంగా ఉన్నాడని, అతడి ల్యాప్‌టాప్‌లో పోర్న్ చిత్రం నడుస్తూ ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు 2008లో ఇంగ్లండ్‌లో క్రిస్ నికొలస్ అనే 23 ఏళ్ల యువకుడు కూడా పోర్న్ చూస్తూ గుండెపోటుతో మరణించాడు.
పుట్టుకతోనే గుండె సమస్య ఉన్న అతడికి .. అప్పటికి కొద్దిరోజుల ముందే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అతడు చనిపోయే సమయానికి పోర్న్ చూస్తున్నాడని, దాంతో ఎడ్రినలిన్ ఎక్కువై అతడు మరణించాడని స్వయానా అతడి తల్లి చెప్పారు. 50 ఏళ్ల వయసు దాటినవారు, శరీరం బరువు ఎక్కువగా ఉన్నవాళ్లకు లైంగిక కార్యకలాపాల సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య పరిశోధనలలో వెల్లడైంది.
పోర్న్ చూస్తూ.. గుండెపోటుతో మృతి
Published Thu, Jun 9 2016 8:11 PM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM
Advertisement
Advertisement