
లండన్ : సాధారణంగా పార్లమెంటు అంటే ప్రజల జీవితాలకోసం మార్గదర్శకాలను రూపొందించే గొప్ప వేదిక. మొత్తం దేశం నడవడిక ఇక్కడ నుంచే రూపొందిస్తారు. ఇట్టి పార్లమెంటులో మంచి ప్రవర్తన, నడవడికను కలిగిన వ్యక్తులుండాలని అంటారు. అయితే, బ్రిటన్ పార్లమెంటు(హౌజ్ ఆఫ్ పార్లమెంట్)కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆ పార్లమెంటులో ఉన్న కంప్యూటర్ల నుంచి తమకు అశ్లీల వెబ్‌సైట్‌లు యాక్సెస్ ఇవ్వాలని దాదాపు 24,473 విన్నపాలు వచ్చినట్లు బ్రిటన్ ప్రెస్ అసోసియేషన్ వెల్లడించింది.
ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఎఫ్‌ఓఐ) పేరిట బ్రిటన్ ప్రెస్ అసోసియేషన్ ఈ సమాచారం సేకరించింది. గత ఏడాది (2017) జూన్ నుంచి డిసెంబర్ వరకు అశ్లీల వెబ్‌సైట్‌లు యాక్సెస్ ఇవ్వాలని రోజుకు 160 రిక్వెస్ట్‌లు వచ్చినట్లు తెలిపింది. వెస్ట్‌మినిస్టర్‌లో ఇప్పటికే పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాలపై ప్రధాని థెరిసా మే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ కారణంతోనే ఆమె స్నేహితుడైనా క్షమించకుండా మంత్రి డామియన్ గ్రీన్‌ను గత ఏడాది తొలగించారు. ఆయన కంప్యూటర్లలో అశ్లీల వీడియోలు లభించినప్పటికీ పోలీసులను తప్పుదారి పట్టించారని ఆరోపణలు రావడంతో ఆయన్ను తొలగించారు. అయితే, తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం చాలామంది ప్రభుత్వ పెద్దలు తమ కంప్యూటర్ల నుంచి అశ్లీల వీడియోల కోసం రిక్వెస్ట్‌లు పంపిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment