ఆంక్షలు పాటించకుంటే.. పోర్న్ సైట్లపై వేటు | Porn sites that refuse to check ages to be forcibly blocked by regulator | Sakshi
Sakshi News home page

ఆంక్షలు పాటించకుంటే.. పోర్న్ సైట్లపై వేటు

Published Sat, Nov 19 2016 6:47 PM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

ఆంక్షలు పాటించకుంటే.. పోర్న్ సైట్లపై వేటు - Sakshi

ఆంక్షలు పాటించకుంటే.. పోర్న్ సైట్లపై వేటు

లండన్‌: పోర్న్ సైట్లపై బ్రిటన్‌ నిబంధనలు విధించింది. చిన్న పిల్లలను పోర్న్ వీడియోలను చూసేందుకు అనుమతించరాదని ఆంక్షలు జారీచేసింది. ఎవరైనా పోర్న్ వీడియోలను చూసేముందు వారి వయసు వివరాలను తెలుసుకోవాలని, ఏ వెబ్‌సైట్‌ అయినా ఈ నిబంధనలను పాటించకపోతే నిషేధిస్తామని హెచ్చరించింది.

11-16 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లల్లో 53 శాతంమంది పోర్న్ వీడియోలకు ఆకర్షితులవుతున్నారని ఓ అధ్యయనంలో తేలంది. దీంతో చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడకుండా కట్టడి చేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. పోర్న్ సైట్లను నియంత్రించే బాధ్యతను రెగ్యులేటర్‌కు అప్పగించనుంది. నిబంధనలను పాటించని ఇంటర్నెట్‌ ప్రొవైడర్లపై చర్యలు తీసుకుంటారు. పిల్లలు హానికరమైన ఆన్లైన్‌ పోర్న్ బారినపడకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని బ్రిటన్‌ సాంస్కృతిక శాఖ మంత్రి కరెన్ బ్రాడ్లీ చెప్పారు. అశ్లీల వీడియోలను చూసేందుకు పెద్దలకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. ఎవరైనా పోర్న్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసేముందు వారి పుట్టిన తేదీని తెలపాలని, వయసు నిర్ధారణ అయిన తర్వాతే పెద్దలకు అనుమతించాలని, ఈ నిబంధనను ఏ వెబ్సైట్‌ అయినా ఉల్లంఘిస్తే బ్లాక్‌ చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement