'అమ్మో.. ఆ టీచరమ్మ పోర్న్ స్టార్.. మాకొద్దు'
లండన్: ఓ వైపు పాఠాలు చెబుతూ రాత్రయితే పోర్న్ స్టార్గా మారిపోయిన ఓ జాగ్రఫీ టీచర్ను ఉద్యోగంలో నుంచి తప్పించారు. రెండేళ్లుగా పాఠాలు బోధిస్తున్న ఆమె అసలు రహస్యం ఓ 14 ఏళ్ల పిల్లాడి కారణంగా బయటపడింది. ఇటీవల పద్నాలుగేళ్ల బాలుడు ఆన్ లైన్లో విహరిస్తుండగా అతడికి పాఠాలు చెప్పే జార్జియానా డీ అనే టీచర్ నగ్న చిత్రాలతో, వీడియోలతో దర్శనమిచ్చింది. ఈ విషయం కాస్త అందరికీ తెలిసి ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలిసిపోయింది.
దీంతో వారు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయడంతో వారు ఆమెపై ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే 27 ఏళ్ల జార్జియాన డీ అనే రోమేనియన్ పాఠశాలలో జాగ్రఫీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె గత కొంత కాలంగా ఎవరికీ తెలియకుండా రాత్రి పూట పోర్న్ స్టార్గా నటిస్తుంది. ఆ వీడియోలు ఆన్లైన్ లో కూడా విహరిస్తున్నాయి. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియదు. అయితే, ఇదే పాఠశాలకు చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలుడికి ఆమె అశ్లీల చిత్రాలు దర్శనమివ్వడంతో అసలు వ్యవహారం బయటపడింది.
స్కూల్ ప్రిన్సిపాల్ అంతర్గత దర్యాప్తునకు ఆదేశించి ఆమెతో వెంటనే రాజీనామా చేయించారు. ఈ విషయం తెలిసి తామంతా దిగ్భ్రాంతికి గురయ్యామని ఆ టీచర్ సహచర ఉద్యోగులు అంటున్నారు. పోర్న్ స్టార్ గా ఉండి అధికమొత్తంలో డబ్బు సంపాధించుకోవాలనే ఆలోచన ఆమె హక్కు అని, అయితే, విద్యాబోధనకు స్వస్తి చెప్పి ఆ పనిచేయాలని వారంతా ఒత్తిడి చేయడంతో ఆమె రాజీనామా చేసింది. ఆ ఫొటోల్లో, వీడియోల్లో ఉంది మాత్రం తాను కాదని, అది ఫేక్ అని చెప్పుకొచ్చింది.