సినిమాల్లో అవకాశాలిస్తామని మభ్యపెట్టి అమ్మాయిలతో అశ్లీల వీడియోలు తీస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
కోల్ కతా: సినిమాల్లో అవకాశాలిస్తామని మభ్యపెట్టి అమ్మాయిలతో అశ్లీల వీడియోలు తీస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కోల్ కతా బిధానగర్ లోని శాటిలైట్ టౌన్షిప్ ఏరియాలోని ఒక ఫంక్షన్ హాల్లో పోర్న్ వీడియోలను చిత్రీకరిస్తున్న గ్యాంగ్ను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. 28 మంది సభ్యులున్న ఈ ముఠాలో ఏడుగురు మహిళలు కూడా ఉండడం సంచలనం రేపింది.
సినిమా అవకాశాల పేరుతో మభ్య పెట్టి యువతులకు వల విసురుతున్నారని డీసీపీ ఏపీ బరూయి వెల్లడించారు. తర్వాత వారిని బెదిరించి, భయపెట్టి చిత్రీకరించిన అశ్లీల వీడియోలను పోర్న్ సైట్స్లో పెట్టి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. పక్కా సమాచారంతో నిఘాపెట్టి ప్రధాన నిందితుడు సహా, మ్యారేజ్ హాల్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.