షకీలా పాత్రలో! | Huma Qureshi to act as Shakeela | Sakshi
Sakshi News home page

షకీలా పాత్రలో!

Published Sun, Jun 12 2016 11:38 PM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

షకీలా పాత్రలో! - Sakshi

షకీలా పాత్రలో!

సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా దాదాపు నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘డర్టీ పిక్చర్’ ఓ సంచలనం. జీవిత చరిత్రలకు వెండితెర మీద మంచి మార్కెట్ ఉంటుందని నిరూపించిన చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడు మరో శృంగార తార జీవితం వెండితెర మీద సందడి చేయడానికి సిద్ధం కానుంది. ఆమె ఎవరో కాదు.. షకీలా. ఒకప్పుడు మలయాళ  పరిశ్రమలో ఆమె ఓ పెను సంచలనం. షకీలా సినిమా విడుదలవుతోందంటే అప్పట్లో  మమ్ముట్టి, మోహన్‌లాంటి  లాంటి సూపర్‌స్టార్లే వెనక్కుతగ్గేవారట.

80, 90 దశకాల్లో శృంగార తారగా బాక్సాఫీస్‌ను ఆ స్థాయిలో శాసించారామె. షకీలా వృత్తి జీవితం మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా సంచనలమే. ఆమె జీవితం ఆధారంగా సినిమా తీయడానికి కొంతమంది సన్నాహాలు చేసినా, కుదరలేదు. చివరకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట.

షకీలా పాత్రలో బాలీవుడ్ కథానాయిక హ్యూమా ఖురేషీ నటించే అవకాశం  ఉందని సమాచారం. అప్పట్లో సంచ లనాలకు కేంద్రబిందువుగా ఉన్న షకీలా రియల్ లైఫ్.. రీల్‌పైకి వస్తే.. కచ్చితంగా ఆ సినిమాకి చాలా క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement