పోలీస్ స్టేషన్కు సన్నీలియోన్ | Sunny Leone, Accused in Obscenity Case, Went to a Police Station Today | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్కు సన్నీలియోన్

Published Wed, May 27 2015 8:13 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

పోలీస్ స్టేషన్కు సన్నీలియోన్ - Sakshi

పోలీస్ స్టేషన్కు సన్నీలియోన్

బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.

ముంబయి: బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అభ్యంతరకరమైన సన్నివేశాలతో సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందంటూ ఆమెపై నమోదైన కేసుల విషయంలో వివరణ ఇచ్చేందుకు ఆమె థానేకు చెందిన సైబర్ క్రైం సెల్కు హాజరై పోలీసుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. డాంబివలికి చెందిన గృహిణి ఫిర్యాదు మేరకు తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఆమెపై ఐటీ యాక్ట్ కింద, మహిళలను అసభ్యకరంగా చూపించకుండా నిలువరించే చట్టం ప్రకారం ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు తెలిపారు. గతంలో అశ్లీల చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కూడా అదే తరహాలో యువతను పెడ త్రోవ పట్టిస్తుందని, గృహిణులకు ఇబ్బందికలుగుతుందని, ఎలాంటి సైట్లలోకి వెళుతున్న ఆమె అభ్యంతరకరమైన ఫొటోలు కనిపిస్తున్నాయని ఇటీవల ఫిర్యాదులు ఎక్కువుతున్నాయి. ఆ ఆరోపణలు రుజువైతే సన్నిలియోన్ ఐదేళ్లు జైలు జీవితం గడపాల్సి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement