![Whatsapp new feature reply privately shown by mistake - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/29/whatsapp_0.jpg.webp?itok=qTRvSDti)
లండన్: వాట్సాప్ మొబైల్ యాప్ రిప్లై ప్రైవేట్లీ అనే సదుపాయాన్ని పొరపాటున యాక్టివేట్ చేసింది. ఈ విధానంలో గ్రూపులో ఉంటూనే ఓ సభ్యుడికి గ్రూప్ నుంచి ఇతర సభ్యులకు తెలియకుండా సందేశం పంపొచ్చు. వాట్సప్ బీటా ఆప్‌డేట్‌లో ఈ సదుపాయం కనిపించిన కాసేపటికే మాయమైందని బ్రిటన్ మీడియా తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉందని, ఇతర ఫీచర్లతో కలిపి రిప్లై ప్రైవేట్లీని విడుదల చేస్తారని వెల్లడించింది. డెవలపర్లు పొరపాటును దీనిని యాక్టివేట్ చేసి ఉంటారని అభిప్రాయపడింది. కాగా, మరికొన్ని రోజుల్లో ఈ కొత్త ఫీచర్‌ను తమ యూజర్లకు తెచ్చే పనిలో యాజమాన్యం బిజీగా ఉండగా ఓ యూజర్ మొబైల్‌లో పొరపాటున ఈ ఫీచర్ కనిపించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment