Kangana Ranaut Reply To Twitter CEO Elon Musk Tweet On Love, Details Inside - Sakshi
Sakshi News home page

Kangana Ranaut : ఎలన్ మస్క్ ట్వీట్.. కంగనా రిప్లై ఇదే!

Published Mon, Mar 20 2023 3:31 PM | Last Updated on Mon, Mar 20 2023 4:08 PM

Kangana Ranaut Reply To Twitter CEO Elon Musk Tweet - Sakshi

కంగనా రనౌత్ పేరు వింటేనే చాలు ఆమె ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే.  ఎప్పుడు వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.  ఎంతటి వారికైనా తనదైన స్టైల్లో దిమ్మదిరిగే కౌంటర్ ఇస్తుంది. ఎలాంటి విషయం అయినా సరే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే నటీనటుల్లో బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ కంగనా రనౌత్‌ ఒకరు. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలను కూడా తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ మరోసారి వైరలవుతోంది. టెస్లా దిగ్గజం ఎలన్ మస్క్‌ చేసిన ట్వీట్‌కు తనదైన స్టెల్లో బదులిచ్చింది బాలీవుడ్ భామ. 

ఎలన్ మస్క్ ట్వీట్‌లో ఏముందంటే?

 ప్రభుత్వాన్ని కూల్చకుండా అడ్డుకునేందుకు సీఏఐ పంపిన నకిలీ వ్యక్తి అని తెలిసినా.. వారితో ప్రేమలో పడటం విభిన్నమైన అనుభూతి’ అంటూ ఎలాన్‌ మస్క్‌ పోస్ట్‌ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు.. కంగనా ప్రేమ గురించే ఆయన మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు.

తాజాగా కంగనా ట్వీట్ చేస్తూ... ' నా కంటే నాటకీయ జీవితాన్ని ఎవరూ కలిగి ఉండరు. ప్రేమ వ్యవహారంలో నన్ను జైలులో పెట్టాలని చూస్తున్న మొత్తం సినిమా మాఫియా కంటే ఇది చాలా ఆసక్తిగా అనిపిస్తోంది.' అంటూ బదులిచ్చింది.   అయితే కంగనా రనౌత్ గతంలో బాలీవుడ్‌ నటుడు హృతిక్‌తో ప్రేమలో ఉన్నసంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఆమె పెట్టిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారడంలో పలువురు నెటిజన్లు.. కంగనా లవ్‌స్టోరీపై కామెంట్స్ పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement