భారత్‌కు అమెరికా గార్డియన్ డ్రోన్లు..
వాషింగ్టన్: భారత నావికా దళానికి గార్డియన్ డ్రోన్లు అమ్మేందుకు అమెరికా అంగీకారం తెలిపింది. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు రక్షణ, భద్రత అంశాల్లో సహకారంపై జరిపిన సమావేశం అనంతరం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే భారత్‌కు 22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్లను విక్రయించనున్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది.
ట్రంప్‌తో తొలిసారిగా భేటీ అయిన మోదీ డ్రోన్ల ఒప్పందం గురించి చర్చించారు. భారత దేశానికున్న సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతంపై నిఘా ఉంచేందుకు కేంద్రం ఈ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. అత్యాధునిక సాంకేతికత గల ఈ డ్రోన్లు 50వేల అడుగుల ఎత్తులో 27గంటలపాటు ప్రయాణించగలవు. ఈ డ్రోన్లను అమెరికా భారత్‌కు విక్రయించే డీల్‌పై చైనా ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే.