
క్యాచ్ ఇట్!
స్పెయిన్ రాజకుటుంబం ప్రైవసీకి డ్రోన్‌లతో తెగ ముప్పొచ్చిపడిందట. రాజ కుటుంబీకుల ఎక్స్‌క్లూజివ్ ఫోటోల కోసం అక్కడి టాబ్లాయిడ్‌లు డ్రోన్‌లను ప్రయోగిస్తున్నాయట. భద్రతాపరంగానూ వీటితో ముప్పు ఎదురయ్యే అవకాశాలుండటంతో చివరికి డ్రోన్‌లను అరికట్టడానికి రెండు డేగలను ఉద్యోగంలో పెట్టుకోవాలని రాజు ఆరో ఫిలిప్ డిసైడయ్యారట.
ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్‌లను పట్టి నేలకు తేవడంలో రెండు నెలలు ప్రత్యేకశిక్షణ పొందిన డేగలను ఇప్పుడు రాజకుటుంబం రక్షణకు వినియోగిస్తున్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ శివార్లలో ఉండే రాజభవనం ‘జర్జుయెలా’ ఇప్పుడిక డేగకన్నుల పహారాలో ఉందన్న మాట.