వాషింగ్టన్ : ఆయుధ సామర్ధ్యం కలిగిన డ్రోన్లను అమెరికా భారత్‌కు అందజేయనుంది. భారత వాయుసేన అభ్యర్ధన మేరకు ఆయుధ సంపత్తి కలిగిన డ్రోన్లను అందజేస్తామని ఓ సీనియర్ అమెరికన్ అధికారి చెప్పారు. ఈ డీల్‌తో భారత్-అమెరికాల మధ్య రక్షణ బంధం బలపడనుంది.
ఈ ఏడాది ఆరంభంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డ్రోన్లు ఇవ్వాలని అమెరికాను కోరింది. ఎనిమిది బిలియన్ డాలర్ల వ్యయంతో 80-100 డ్రోన్ల కొనుగోలుకు సిద్ధమని చెప్పింది. జూన్ నెలలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆయుధ సామర్ధ్యం లేని గార్డియన్ డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. ఈ డ్రోన్లను హిందు మహాసముద్రంలో నిఘా కోసం ఉపయోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment