ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఓ పైలెట్ డ్రోన్‌ను గుర్తించడంతో ఆదివారం సాయంత్రం విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
న్యూఢిల్లీః ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఓ పైలెట్ డ్రోన్‌ను గుర్తించడంతో ఆదివారం సాయంత్రం విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని మూడు రన్‌వేలను తాత్కాలికంగా మూసివేశారు. షెడ్యూల్ ప్రకారం విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గమ్యస్ధానాలకు చేరుకోవడంలో జాప్యం నెలకొనడంతోఅసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొద్ది సేపటికి సర్వీసులను పునరుద్ధరించడంతో విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.