హైదరాబాద్: ఎవరు పడితే వారు డ్రోన్‌లను వినియోగించకుండా నియత్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్‌లకు ప్రత్యేకంగా బోర్డు ‘4.0’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రూ.50 కోట్ల కార్పొస్ ఫండ్ తో బోర్డు ‘4.0’ను ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాలు, అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కొనుగోలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ ఆమోదం తెలిపారు. దీంతో గురువారం జరగనున్న మంత్రివర్గ సమావేశానికి బోర్డు ఏర్పాటు ప్రతిపాదనలు రానున్నాయి.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భాగంగానే ఈ బోర్డు పనిచేయనుంది. ఐటీ శాఖ కార్యదర్శి, డీజీపీ సభ్యులుగా ఉంటారు. ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్‌లతో ఇష్టానుసారం చిత్రీకరిస్తారని, చిత్రీకరణకు ఒక హద్దు ఉండాలని, ఇందుకు ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ డ్రోన్‌ల వల్ల శాంతిభద్రతల విషయంలో కూడా ప్రమాదం ఉంటుందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. రాష్ర్టంలో డ్రోన్‌లు ఎవరికి అవసరమైనా బోర్డు ద్వారానే పొందాలని నిబంధనను విధించనున్నారు.
పెళ్లిళ్లు, ఇతర ఉత్సవాలు, బహిరంగ సభలు తదితర కార్యాకలాపాలకు కార్పొరేషన్ ద్వారానే డ్రోన్‌లను పొందాల్సి ఉంటుంది. ప్రైవేట్ కార్యకలాపాలకు డ్రోన్‌లను అద్దెకు ఇవ్వనున్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాలతో పాటు, ఈ ఏడాది కష్ణా పుష్కరాల్లో డ్రోన్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పటికీ ప్రై వేట్ రంగంలో డ్రోన్‌లు అయితే చిత్రీకరిస్తాయి. అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే అవసరమైన మేరకే చిత్రీకరించేందుకు నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యలోనే డ్రోన్‌ల నిర్వహించడం మంచిదేనని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా డ్రోన్‌లను వినియోగిస్తామని ఇటీవల సీఎం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
రూ.50 కోట్లతో డోన్ల బోర్డు ‘4.0’
Published Wed, Sep 21 2016 8:51 PM | Last Updated on Fri, May 25 2018 1:14 PM
Advertisement
Advertisement