
డ్రోన్ కెమెరా కలకలం
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక సందర్భంగా శనివారం విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది.
ఏలూరు రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రికి ర్యాలీ చేరుకోగానే రహదారి పక్కనున్న చెట్టు కొమ్మల్లో డ్రోన్ కెమెరా చిక్కుకుంది. దీన్ని తప్పించేందుకు ఆపరేటర్లు ప్రయత్నాలు చేస్తుండగానే వెంకయ్య ప్రయాణిస్తున్న వాహనం సమీపించింది. అదే సమయంలో డ్రోన్ కెమెరా పైనుంచి ఒక్కసారిగా కుప్పకూలి వెంకయ్యకు అతి సమీపంలోనే పడింది. దీంతో ప్రముఖులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఊహించని ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.