
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆస్థాన మండపం సమీపంలోని రోడ్డుపై నుంచి డ్రోన్లను ఎగురవేశారు. దీంతో, వీటిని ఎవరు ఎగురవేశారనే ప్రశ్నలు తలెత్తాయి.
అయితే, డ్రోన్లను ఎగురవేస్తున్న సమయంలో స్థానికులు డ్రోన్ దృశ్యాలను చిత్రీకరించారు. డ్రోన్లతోనే శ్రీవారి ఆలయ దృశ్యాల చిత్రీకరణ జరిగింది. కాగా, కాకులకోన వద్ద సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వీడియోలు తీసేందుకే డ్రోన్ ఆపరేటర్ అక్కడకు వచ్చినట్టు గుర్తించారు. మూడు నెలల ముందు సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వీడియోలను డ్రోన్లతో చిత్రీకరించేందుకు టీటీడీ అనుమతించింది. ఆ సమయంలో శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలను డ్రోన్ ఆపరేటర్ చిత్రీకరించారు. దీంతో, డ్రోన్లను ఎవరు ఎగురవేశారనే విషయం బయటకు వచ్చింది.