![Dad Shares Shark Moving Towards His Children In Florida Beach - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/5/shark.jpg.webp?itok=CufryEmY)
ఫ్లోరిడా : అదృష్టం బాగుండబట్టి ఆ పిల్లలు ప్రాణాలతో మిగిలారు. లేదంటే క్షణకాలంలో ఆ యమకింకరి వారి ఉసురుతీసేది. దేవుడిలా అక్కడే ఉన్న తండ్రి యుముడిలా దూసుకొస్తున్న షార్క్ బారినుంచి కుంటుంబాన్ని రక్షించాడు. ఫ్లోరిడాలోని న్యూ స్మిర్నా బీచ్‌కి కుటుంబంతో కలిసివెళ్లిన డానియెల్ వాట్సన్ ఒడ్డున కూర్చుని తన డ్రోన్ కెమెరాతో నీటిలో కేరింతలు కొడుతున్న తన పిల్లలు, భార్య ఫోటోలు షూట్ చేస్తున్నాడు. ఆ సమయంలో వారి వైపునకు ఏదో నల్లని ఆకారం కదులుతూ వస్తోంది.
కెమెరా ఇంకొంచెం క్లారిటీ చేయడంలో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. మనుషుల్ని మింగే షార్క్ తన కుటుంబం వైపునకు దూసుకొస్తోంది. వెంటనే తన భార్యను అప్రమత్తం చేశాడు. నీటిలో నుంచి బయటికి రావాలని కేకలు వేశాడు. భర్త అరుపుల్ని విన్న ఆ మహిళ కాసింత లోపలికి వెళ్లి ఆడుకుంటున్న పిల్లల్ని తీసుకొని క్షణాల్లో ఒడ్డుకు చేరింది. డానియెల్ ఊపిరిపీల్చుకున్నాడు. అనంతరం వారికి నీటిలో దాగున్న షార్క్ ఫొటోలను చూపించాడు. సరిగ్గా షార్క్ వారం క్రితం అదే బీచ్‌లో ఓ 18 ఏళ్ల యువకున్ని అదే షార్క్ పొట్టనబెట్టుకోవడం గమనార్హం. షార్క్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment