
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవుడి మాన్యాల ఆక్రమణలను గుర్తించేందుకు డ్రోన్ల ద్వారా ప్రత్యేక సర్వే నిర్వహించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. దేవదాయ శాఖ పరిధిలోని దాదాపు 22 వేల ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట 4,09,229.99 ఎకరాల భూమి ఉండగా 67,525.06 ఎకరాలు ఏళ్ల తరబడి ఆక్రమణదారుల చెరలోనే ఉన్నాయి. 3,613.62 ఎకరాలను లీజుకు తీసుకున్న కౌలుదారులు నిర్ణీత గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదు.
► ఆక్రమణలకు గురైన భూముల్లో డ్రోన్లతో సర్వే నిర్వహించి ఆలయాలవారీగా రికార్డులను సిద్ధం చేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం సన్నద్ధమైంది.
► రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్రోన్ కార్పొరేషన్ – దేవదాయ శాఖ అధికారుల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయి. డ్రోన్లతో చిత్రీకరించిన ఫోటోలు, వీడియోల ఆధారంగా తదుపరి దశలో చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment