
సాక్షి, విజయవాడ: వరద ఉధృతిని అంచనా వేయడం కోసం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ డ్రోన్ ఉపయోగించిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపైన ఎగరేసిన డ్రోన్ వివాదంపై డీజీపీ స్పందించారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడంతో కమ్యూనినేషన్ గ్యాప్ వచ్చిందని వివరణ ఇచ్చారు.ఇందులో ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు.దీనిని రాజకీయం చేయొద్దని..ఇరిగేషన్ అధికారులకు, స్థానిక పోలీసులకు మధ్య సమన్వయం లేని కారణంగానే ఈ వివాదం నెలకొందన్నారు. ఇకపై డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.