ఒక చోటు నుంచి మరో చోటుకు వస్తువులను చేరవేసే డ్రోన్లను ఇప్పటికే కొన్ని దేశాలు ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మనుషులను అంటే ప్రయాణికులను ఒక చోటు నుంచి వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లేందుకు వీలుగా తయారు చేసిన పైలెట్‌లేని ‘వెలోకాప్టర్’ను దుబాయ్ రోడ్డు అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ శుక్రవారం ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ఇద్దరు ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యంతో తయారు చేసిన ఈ వెలోకాప్టర్‌ను ప్రయాణికులు లేకుండా ప్రయోగించి విజయం సాధించింది.