
తాజ్ వద్ద డ్రోన్ కలకలం
చారిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్ వద్ద డ్రోన్ ఒకటి కలకలం రేపింది.
ఆగ్రా: చారిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్ వద్ద డ్రోన్ ఒకటి కలకలం రేపింది. హైసెక్యూరిటీ జోన్‌లో ఉన్న తాజ్‌మహల్ వద్ద శనివారం మధ్యాహ్న సమయంలో డ్రోన్‌ను ఎగురవేస్తున్న అమెరికా పర్యాటకుడిని పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని ఒహయో ప్రాంతానికి చెందిన నికోలస్‌గా గుర్తించారు. రెండు సార్లు తాజ్‌మహల్ వద్ద డ్రోన్ ఎగరడం గుర్తించామని హైసెక్యూరిటీ జోన్‌లో వీటిని ఎగరవేయడం నేరమని సీఐఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. ఆ పర్యాటకుడిని స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని యుఎస్ ఎంబసీకి కూడా తెలిపామన్నారు.