
డ్రోన్ కెమెరాలపై నిషేధం ఉన్నా మలక్ పేట నియోజకవర్గం ఎంఐఎం పార్టీ ర్యాలీలో డ్రోన్ కెమెరాలు హాలచల్ చేశాయి.
సాక్షి, హైదరాబాద్ : నగరంలో డ్రోన్ కెమెరాలపై నిషేధం ఉన్నా మలక్ పేట నియోజకవర్గం ఎంఐఎం పార్టీ ర్యాలీలో డ్రోన్ కెమెరాలు హాలచల్ చేశాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనతో పాటు, నిషేధిత డ్రోన్ కెమెరాలు ఉపయోగించడంతో చాదర్ ఘాట్ ఎస్‌ఐ, బీజేపీ నాయకులు నిర్వాహకులపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.