ఓ చిన్న డ్రోన్ 55 విమానాలను ఆపేసింది! | Drone delays 55 flights in China | Sakshi
Sakshi News home page

ఓ చిన్న డ్రోన్ 55 విమానాలను ఆపేసింది!

Published Sun, May 29 2016 11:15 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

ఓ చిన్న డ్రోన్ 55 విమానాలను ఆపేసింది! - Sakshi

ఓ చిన్న డ్రోన్ 55 విమానాలను ఆపేసింది!

బీజింగ్: చైనాలోని ఓ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయం మీదుగా ఓ డ్రోన్ చెక్కర్లు కొడుతుండటంలో అధికారులు ఎక్కడి విమానాలను అక్కడే నిలిపేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సిచువాన్ ప్రావిన్స్లో ఉన్న చెంగ్డూ షాంగ్లీ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా ఉన్న అధికారులకు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయం మీదుగా ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలియని ఓ డ్రోన్ చెక్కర్లు కొడుతుండటంతో బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న 55 విమానాలను కొంత సమయం పాటు అలాగే నిలిపేశారు. ప్రమాదమేమీ లేదని నిర్థారించుకున్న తరువాత విమానాలు గంటన్నర ఆలస్యంగా బయలుదేరాయి. ఆ డ్రోన్కు సంబంధించి అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే ఓ డ్రోన్ మూలంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగటం ఇదే తొలిసారని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement