
సాక్షి, ముంబై: ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో షాపింగ్ అంటే కత్తి మీద సామే అనిపిస్తోంది. పార్సిల్ వచ్చి దాన్ని విప్పి, వస్తువు క్వాలిటీ చెక్ చేసే దాకా ఎలాంటి గ్యారంటీ లేదు. కట్ చేస్తే ..ఆన్‌లైన్‌లో డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే..అలుగడ్డలతో వచ్చిన ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్ అయ్యాడు.
ఇదీ చదవండి: పీకల్లోతు కష్టాల్లో వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్
వివరాల్లోకి వెళితే బిహార్‌కు చెందిన చేతన్ కుమార్ అనే వ్యాపారవేత్త, ఆన్‌లైన్‌లో డ్రోన్ కెమెరాను ఆర్డర్ చేశాడు. ఎందుకు అనుమానం వచ్చిందో ఏమో గానీ, ప్యాకెట్ డెలివరీ చేస్తున్న బాయ్ ద్వారానే దాన్ని ఆన్‌బాక్స్ తీస్తూ వీడియో తీశాడు. దీంతోకస్టమర్‌తోపాటు,డెలివరీ బాయ్ తెల్లముఖం వేశాడు. ఎందుకంటే అందులో గుండ్రటి బంగాళా దుంపలు వెక్కిరించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్‌లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తూ, లేదా బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఏ ఆన్‌లైన్ కంపెనీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. (28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే!)
ऑनलाइन शॉपिंग करना पड़ा महँगा, युवक ने मंगाया ड्रोन, निकला आलू | Unseen India
पूरा वीडियो- https://t.co/KxZ0RsZwUl pic.twitter.com/s81XVfE5Vb
— UnSeen India (@USIndia_) September 26, 2022