Online shopping sites
-
డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే...ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్!
సాక్షి, ముంబై: ఆన్లైన్ షాపింగ్ సైట్లలో షాపింగ్ అంటే కత్తి మీద సామే అనిపిస్తోంది. పార్సిల్ వచ్చి దాన్ని విప్పి, వస్తువు క్వాలిటీ చెక్ చేసే దాకా ఎలాంటి గ్యారంటీ లేదు. కట్ చేస్తే ..ఆన్లైన్లో డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే..అలుగడ్డలతో వచ్చిన ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్ అయ్యాడు. ఇదీ చదవండి: పీకల్లోతు కష్టాల్లో వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ వివరాల్లోకి వెళితే బిహార్‌కు చెందిన చేతన్ కుమార్ అనే వ్యాపారవేత్త, ఆన్లైన్లో డ్రోన్ కెమెరాను ఆర్డర్ చేశాడు. ఎందుకు అనుమానం వచ్చిందో ఏమో గానీ, ప్యాకెట్ డెలివరీ చేస్తున్న బాయ్ ద్వారానే దాన్ని ఆన్‌బాక్స్ తీస్తూ వీడియో తీశాడు. దీంతోకస్టమర్తోపాటు,డెలివరీ బాయ్ తెల్లముఖం వేశాడు. ఎందుకంటే అందులో గుండ్రటి బంగాళా దుంపలు వెక్కిరించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తూ, లేదా బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఏ ఆన్లైన్ కంపెనీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. (28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే!) ऑनलाइन शॉपिंग करना पड़ा महँगा, युवक ने मंगाया ड्रोन, निकला आलू | Unseen India पूरा वीडियो- https://t.co/KxZ0RsZwUl pic.twitter.com/s81XVfE5Vb — UnSeen India (@USIndia_) September 26, 2022 -
డబ్బు ఆదా : ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ సీక్రెట్ మీకోసమే
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్స్‌ను నిర్వహిస్తుంటాయి. ఆ సేల్‌లో పలు ప్రొడక్ట్‌లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అదే సమయంలో కొనుగోలు దారుల్ని ఆకర్షించేందుకు ప్రొడక్ట్ అసలు ధర ఎంతో దాచిపెట్టేస్తుంటాయి. ధరను భారీ ఎత్తున తగ్గిస్తాయి. ఈ ప్రొడక్ట్ అసలు ధర ఇంత ఉంది. మేం నిర్వహించే ఈ సేల్‌లో ఆ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేస్తే మీకు ఇంత ధరకే వస్తాయని ఊరిస్తుంటాయి. అంతే ఆ ప్రకటనతో కొనుగోలు దారులు ఆ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. తీరా సదరు ఈకామర్స్ వెబ్సైట్లో ఆ ప్రొడక్ట్ కొనుగోలు ప్రాసెస్ పూర్తి చేసి పేమెంట్ చేసే సమయానికి అసలు ధర కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో యూజర్లు ఆ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసి జేబుకి చిల్లు పెట్టుకుంటుంటారు. అందుకే అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాల్ని పాటించాల్సి ఉంటుంది. ఫెస్టివల్ సీజన్లో ఈకామర్స్ సంస్థలు నిర్వహించే సేల్‌లో ఉదాహారణకు ఓ స్మార్ట్ ఫోన్ ధర రూ.45వేలు ఉంటే.. ఆ ఫోన్‌ను రూ.30వేలకే సొంతం చేసుకోవచ్చని ఆఫర్ ప్రకటిస్తాయి. కానీ కస్టమర్ల నుంచి వసూలు చేసే వాస్తవ ధరకు సదరు ఈకామర్స్ వెబ్ సైట్లో చూపించే అసలు ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాంటి ప్రత్యేక సేల్ జరిగే సమయాల్లో మనం కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రొడక్ట్ అసలు ధర ఎంతో తెలుసుకుంటే డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు. ముందుగా డెస్క్ టాప్‌లో గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌ను వినియోగిస్తుంటే బ్రౌజర్ ఎక్స్ టెన్షన్‌ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం యూజర్లు క్రోమ్ వెబ్ స్టోర్‌లోకి వెళ్లి అక్కడ్ కీపా (keepa)ఎక్స్‌టెన్షన్‌ను సెర్చ్ చేసి.. ఆ క్రోమ్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత క్రోమ్, మోజిల్లాలో యాడ్ చేసుకోవాలి. అనంతరం అదే ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసి.. మీరు ఏ ఈకామర్స్‌కు సంబంధించిన వెబ్సైట్లో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ సంస్థ సైట్‌ను ఓపెన్ చేసి ప్రొడక్ట్‌ను ఎంటర్ చేస్తే మీకు చూపించే ప్రొడక్ట్ అసలు ధర గ్రాఫ్ రూపంలో మనకు కనిపిస్తుంది. -
ఫెస్టివల్ సీజన్: ఆన్లైన్ షాపింగ్‌లో ఆఫర్లే ఆఫర్లు! ఇక 'పండగ' చేస్కోండి!
న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు విక్రయాలను పెంచుకునేందుకు తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి.ఈ సీజన్లో వినియోగ డిమాండ్ పుంజుకుంటుందని వస్త్రాలు, ఇంటి డెకరేటివ్ ఉత్పత్తులు, గృహోపకరణాల కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఉగాదితో పండుగల సందడి మొదలైంది. త్వరలో శ్రీరామనవమి రానుంది. అలాగే రంజాన్ మాసం మొదలైంది. దీంతో విక్రయాలు పెంచుకోవడంపై కంపెనీలు దృష్టి సారించాయి. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ డిస్కౌంట్ (ఎంఆర్పీపై తగ్గింపు)లను ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. గత రెండు వేసవి సీజన్లలో కరోనా తీవ్రత కంపెనీల అమ్మకాలపై పడడంతో.. ప్రస్తుత సీజన్ సానుకూలంగా ఉంటుందని అంచనాతో ఉన్నాయి. అమెజాన్, మింత్రా, షాపర్స్‌స్టాప్, లైఫ్‌స్టయిల్ సంస్థలు 20–50 శాతం మేర వస్త్రాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. వస్త్రాలు, కాస్మొటిక్స్, వాచీలు, గహోపకరణాలు, డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్రాండ్లపై ఆఫర్లు అమలు చేస్తున్నట్టు ఆయా ప్లాట్‌ఫామ్‌ల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. వస్త్రాలు, సౌందర్య ఉత్పత్తులపై.. అమెజాన్ అయితే షావోమీ, వన్‌ప్లస్, మేబెల్లిన్ (సౌందర్య ఉత్పత్తులు), షుగర్ కాస్మెటిక్స్, సోనీ, అలెక్సా స్పీకర్లపై ప్రస్తుతం ఆఫర్లను అమలు చేస్తోంది. శామ్సంగ్ అయితే ఖరీదైన టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషిన్లపై బ్లూఫెస్ట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల చివరి వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఆదిదాస్, పూమ ఉత్పత్తులపై షాపర్స్‌స్టాప్ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. నైకా కూడా షుగర్, ప్లమ్, మామాఎర్త్ సౌందర్య ఉత్పత్తులపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఫర్నిచర్ బ్రాండ్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్) పెప్పర్ఫ్రై, జేబీఎస్ స్పీకర్స్ 25–40 శాతం మధ్యలో తగ్గింపు ఇస్తున్నాయి. అధిక నిల్వలు.. ‘‘చాలా ఈ కామర్స్ సంస్థల పరిధిలో ఉత్పత్తుల నిల్వలు పేరుకున్నాయి. జనవరి నుంచి వీటిని తగ్గించకోవడంపై అవి దృష్టి సారించాయి. కానీ, కరోనా మూడో విడత ప్రతికూలతల వల్ల ఇది సాధ్యపడలేదు. పైగా ఆన్లైన్లో షాపింగ్ చేసే కస్టమర్లు ప్రధానంగా డిస్కౌంట్స్, ఆఫర్స్ చూస్తారు’’ అని రిటైల్ కన్సల్టెన్సీ సంస్థ ‘థర్డ్ ఐసైట్’కు చెందిన దేవాన్షు దత్తా తెలిపారు. జివామే, వావ్ స్కిన్ సైన్స్, మింత్రా, అజియో, ఎంకెఫైన్ తదితర బ్రాండ్లు ఆఫర్ చేసే డిస్కౌంట్లకు ఆన్లైన్ షాపర్స్ నుంచి మంచి స్పందన కనిపిస్తోందని క్యాష్‌కరో సహ వ్యవస్థాపకుడు రోహన్ భార్గవ తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్లపై క్యాష్‌బ్యాక్ కూపన్లను క్యాష్ కరో ఆఫర్ చేస్తుంటుంది. ‘‘ఆన్లైన్ ఆఫర్ల విషయానికొస్తే డీ2సీ బ్రాండ్స్ ముందున్నాయి. దీంతో యూజర్ల నుంచి కూడా డిమాండ్ పెరిగింది’’ అని భార్గవ వివరించారు. హోలి పండుగ నుంచే డిస్కౌంట్స్, ఆఫర్ల సందడి మొదలైనట్టు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ముఖ్యంగా టైర్–2, టైర్–3 పట్టణాల నుంచి ఎక్కువ స్పందన వస్తోందని పేర్కొన్నారు. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మధ్యాదాయ వర్గాల కొనుగోలుదారులే 80 శాతంగా ఉంటారు. 2021 నాటికి 7.8 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య 2026 నాటికి మూడు రెట్లు పెరిగి 25.6 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ‘‘రష్యా యుద్ధం వల్ల తయారీ వ్యయాలు పెరిగి, సరఫరా సమస్యలు నెలకొన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా, ప్రాంతీయంగా పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన ఆఫర్లు, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం’’అని గృహోపకరణాల సంస్థ వండచర్చెఫ్ ఎండీ రవి సక్సేనా వెల్లడించారు. చదవండి: ఆన్లైన్లో వస్తువులు కొని మోసపోయారా? అయితే వెంటనే ఇలా చేయండి? -
తక్కువ రేట్లకే బ్రాండెడ్ వస్తువులు.. డబ్బు కట్టాక రివ్యూలు చూస్తే!
Hyderabad Fraud Shopping Website: బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీలో కళ్ల జోడు యాడ్ వచ్చింది. దానిపై ప్రముఖ కంపెనీ పేరు ఉండటంతో పాటు క్లియరెన్స్ సేల్ అని కనిపించడంతో ఆయన ముందుకు వెళ్లారు. మార్కెట్లో కనీసం రూ.10 వేలు ఖరీదు చేసే చలువ కళ్లజోడు కేవలం రూ.2 వేలకే అంటూ అందులో ఉంది. ఆ మొత్తం ఫోన్ పే ద్వారా చెల్లించిన ఆయన కొన్ని రోజులకు మోసపోయినట్లు గుర్తించారు. ఇటీవల కాలంలో అనేకమంది ఇలాంటి ఆన్లైన్ ప్రకటనల బారినపడి మోసపోతున్నారు. నష్టపోయేది చిన్న మొత్తాలు కావడంతో పోలీసుల వరకు వెళ్లకుండా మిన్నకుండిపోతున్నారు. ఇదే మోసగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది. నగరంలో ప్రతి రోజూ వందలాది మంది ఈ యాడ్స్ బారినపడుతున్నారని తెలుస్తోంది. క్లియరెన్స్ సేల్ పేరుతో... ఫేస్బుక్ సహా వివిధ సోషల్‌మీడియా సైట్ల ద్వారా నకిలీ కంపెనీలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కళ్లజోళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, ఉడెన్ ఫర్నిచర్.. ఇలా అనేక ఉత్పత్తులకు సంబంధించి ఈ ప్రకటనలు కనిపిస్తున్నాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్న ఆ ప్రకటనల్లో ఉత్పత్తుల ఫోటోలు అదే స్థాయిలో ఉంటున్నాయి. బహిరంగ మార్కెట్లో దొరికే వాటి కంటే ఆకట్టుకునేలా, అతి తక్కువ రేటుతో కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లోనూ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సేల్స్, క్లియరెన్స్ సేల్ అంటూ మోసగాళ్లు పొందుపరుస్తున్నారు. వీటిని చూసిన ఎవరైనా తక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని అనుమానించట్లేదు. ‘పైన’ ఒకటి.. ‘అడ్రస్’ మరోటి.. ► ఈ ప్రకటనలు సైతం చూసే వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉంటున్నాయి. సదరు వెబ్ పేజీ తెరిచిన వెంటనే పైన ప్రముఖ కంపెనీల పేర్లు దర్శనమిస్తున్నాయి. మోసగాళ్లు ఎక్కువగా ఈ–కామర్స్ రంగంలో పేరెన్నికగన్న కంపెనీల పేర్లు, లోగోలు వాడుతున్నారు. ► ఆయా సైట్లలో షాపింగ్ చేయడానికి పొందు పరచాల్సిన ఫోన్ నంబర్, చిరునామా తదితరాలకు సంబంధించిన అంశాలన్నీ ఈ పేజీలోనూ ఉంటున్నాయి. ఆ పేజీలకు సంబంధించిన అడ్రస్ బార్లో మాత్రం ఆయా కంపెనీ అడ్రస్‌లు ఉండట్లేదు. ► సాధారణంగా ప్రముఖ కంపెనీల నుంచి ఆన్లైన్లో ఖరీదు చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. కొన్ని ప్రాంతాలు, ఉత్పత్తులకు మినహాయిస్తే మిగిలిన వాటికి ఇది కచ్చితంగా కనిపిస్తుంటుంది. ► బోగస్ వెబ్సైట్లలో మాత్రం ఈ అవకాశం ఉండదు. ఖరీదు చేసే వాళ్లు కచ్చితంగా అప్పటికప్పుడే గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐలు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు చెల్లించిన తర్వాతే ఆర్డర్ ఖరారు అవుతోంది. చదవండి: ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు..హైదరాబాద్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు ‘మార్కెటింగ్ ఇంటెలిజెన్స్’ ఏమైనట్లు? ► బాధితులు నష్టపోయేది తక్కువ మొత్తాలే కావడంతో కనీసం 5 శాతం మందీ పోలీసు వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. డబ్బు తిరిగి రాదు సరికదా ఠాణా చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు భావిస్తుండటమే దీనికి కారణం. సైబర్ స్పేస్‌లో జరిగే ఈ తరహా మోసాలను ముందుగానే కనిపెట్టాల్సిన అవసరం ఉంది ► నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, కేసుల దర్యాప్తులో తలమునకలై ఉంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు ఈ విషయాలు పట్టించుకోవట్లేదు. ఫలితంగా మోసగాళ్లు అనునిత్యం అందినకాడికి దండుకుంటున్నారు. ► ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్‌లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. డబ్బు కట్టాక రివ్యూలు చూస్తే... ► డబ్బు చెల్లించిన వినియోగదారులకు కన్ఫర్మేషన్ ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు రావట్లేదు. మరోసారి ఆ పేజ్‌లోకి వెళ్లి తనిఖీ చేయాలని ప్రయత్నిస్తే గతంలో లావాదేవీలు చేసిన పేరుతో కనిపించట్లేదు. ► కొన్నిసార్లు యూపీఐ విధానంలో డబ్బు చెల్లించిన తర్వాత ఆయా సైట్లలోనే ఏదో సాంకేతిక పొరపాటు జరిగింది. మళ్లీ ప్రయత్నించండి’ అంటూ వస్తోంది. ► అప్పటికే చెల్లించిన డబ్బు మాత్రం వినియోగదారులకు తిరిగి రావట్లేదు. అతికష్టమ్మీద షాపింగ్ చేసిన పేజ్‌ను గుర్తించి, పరిశీలిస్తే మాత్రం రివ్యూల ద్వారా అసలు విషయం తెలుస్తోంది. వాటిలో వందల మంది తాము మోసపోయాంటూ రాస్తున్నారు. -
ఆన్లైన్లో వస్తువులు కొని మోసపోయారా? అయితే వెంటనే ఇలా చేయండి?
కోవిడ్ కారణంగా ఆన్లైన్ వినియోగం పెరిగిపోయింది. మనకు కావాల్సిన నిత్యవసర సరుకుల నుంచి గాడ్జెట్స్ వరకు అన్నీ ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తుంటాం. అయితే ఆన్లైన్ వినియోగం పెరగడంతో మోసాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆన్లైన్లో ఫోన్ బుక్ చేస్తే ఇటుక బిళ్ల, సబ్బులు, శానిటైజర్ డబ్బాలు రావడం మనం గమనిస్తుంటాం. ఇలాంటి సమయాల్లో మీరు మోసపోయారని గుర్తిస్తే ఫిర్యాదు చేసుకోవచ్చు. మీకు తప్పక న్యాయం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. ►అమెజాన్‌లో మీరు ప్రొడక్ట్ బుక్ చేస్తే అది ఆ సంస్థది కాదని గుర్తించాలి. అమెజాన్‌లో కోట్లాది మంది సెల్లర్స్ ఉంటారు. వాళ్ల వస్తువుల్ని అమ్మేందుకు మధ్య వర్తిగా ఈకామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్లు ఉంటాయి. ►ఇక ఈ - కామర్స్ సంస్థలకు చెందిన వస్తువులైతే ప్రొడక్ట్ పక్కన ఉదాహరణకు అమెజాన్ ఫుల్ ఫిల్, ఫ్లిప్ కార్ట్ ఎస్యూర్డ్ పేర్లు ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. ►ప్రొడక్ట్ కొనేముందుకు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవాలి ►మీకు డెలివరీ వచ్చిన ప్రొడక్ట్‌ను ఓపెన్ చేసే ముందు నుంచి వీడియో తీసి పెట్టుకుంటే మీకు ఒక ప్రూఫ్‌గా ఉంటుంది ►ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మీరు ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్ మీకు వచ్చినా..ఆ ప్రొడక్ట్ పనిచేయకపోవడం,డ్యామేజ్ అవ్వడంలాంటివి జరుగుతుంటాయి. ►అలా జరిగితే ఈ - కామర్స్ ప్లాట్ ఫామ్‌లోని కొంతమంది సెల్లర్స్ మనకు డబ్బుల్నిరిటన్ చేయడం లేదంటే మీకు కావాల్సిన ఐటమ్ వారం రోజుల్లో రిప్లెస్ చేసి పంపిస్తారు. కొంత మంది పంపించరు. అలాంటి సమయాల్లో తిరిగి మీకు కావాల్సిన ప్రొడక్ట్ లేదంటే డబ్బులు తిరిగి పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ►ఈకామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ►మీకు కస్టమర్ కేర్‌కి కాల్ చేసినా పట్టించుకోలేదంటే..మీ వైపు కరెక్ట్‌గా ఉంటే రిపోర్ట్ చేయోచ్చు. ►మీ ప్రొడక్ట్ డ్యామేజ్ అయినా లేదంటే మీరు తీసుకునే ప్రొడక్ట్ గురించి వెబ్ సైట్లో ఒకలా మీకు డెలివరీ అయిన తరువాత మరోలా ఉంటే కన్జ్యూమర్ కోర్ట్‌లో ఫిర్యాదు చేయోచ్చు. ►కన్జ్యూమర్ ప్రొటస్ట్ యాక్ట్ -2019కింద కంప్లెయింట్ చేయోచ్చు.సెక్షన్-2 లో 10,11,16,28 సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్లలో మీరు ఏ సెక్షన్ బాధితులో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఫుడ్ డెలివరీ, బ్యాంక్ ట్రాన్సక్షన్, ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఇలాంటి వాటిల్లో మీరు మోసపోతే ఫిర్యాదు చేసుకోవచ్చు. ►https://consumerhelpline.gov.in/.లో లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ .1800-11-4000,14404కి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 లోపు ఫోన్ చేయోచ్చు. ►ఎస్ఎంఎస్ అయితే 8130009809కి చేయోచ్చు. ఎన్సీహెచ్,యూఎంఏఎన్‌జీ యాప్‌లో కంప్లెయింట్ చేయోచ్చు. ఇలా డైరక్ట్‌గా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయోచ్చు. ఇలా చేస్తే మీ న్యాయం జరుగుతుంది. అలా జరగకపోతే ప్రైవేట్ సంస్థల్ని సంప్రదించొచ్చు. ►వాటిలో https://icrpc.org/,https://voxya.com/,https://www.onlinelegalindia.com/కి ఫిర్యాదు చేయోచ్చు. వీళ్లు మాత్రం ఫిర్యాదును బట్టి కంప్లెయింట్ తీసుకుంటారు. ► పై వాటితో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా కోర్ట్‌లో ఫిర్యాదు చేయాలంటే ఆన్లైన్లో https://edaakhil.nic.in/index.html లో కంప్లెయింట్, అడ్వికేట్ సెక్షన్లో రిజిస్టరై ఫిర్యాదు చేయోచ్చు. కాకపోతే ఇక్కడ మీరు కంప్లెయింట్‌కు ముందుగా ఓ లాయర్‌ను నియమించుకోవాల్సి ఉంటుంది. -
Good News! ఇక డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్!
New credit debit card rules for online payments from January 1, 2022 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, బిగ్‌బాస్కెట్.. మీకిష్టమైన ఆన్లైన్ వెబ్సైట్లలో షాపింగ్ సులభతరం కానుంది. అవును.. జనవరి 1, 2022 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా మీ చెల్లింపులు సులభతరం కావడమేకాకుండా, మీలావాదేవీల సమాచారం కూడా మరింత భద్రంగా ఉంటుంది. డిజిటల్ చెల్లింపుల కోసం ఇకపై 16-అంకెల కార్డ్ వివరాలను, కార్డ్ గడువు తేదీని గుర్తుంచుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. 'టోకనైజేషన్' అనే కొత్త పద్ధతి ద్వారా త్వరగా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయవచ్చు. టోకనైజేషన్ అంటే ఏమిటి? కొత్త చెల్లింపు పద్ధతి ఎలా ఉండబోతోంది? టోకనైజేషన్ అనేది క్లయింట్లు టోకెన్ ద్వారా కార్డు సమాచారాన్ని వినిమయించుకోవడం ద్వారా వ్యక్తిగత సమాచారంతో సంబంధంలేకుండా కొనుగోళ్లు సజావుగా సాగే విధానం. ఈ కాంటాక్ట్‌లెస్ బ్యాంకింగ్ కోసం సీవీవీ నంబర్ ఇకపై అవసరం లేదు. టోకనైజ్డ్ కార్డ్‌లను ఎలా ఉపయోగించాలి? ►టోకనైజేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేయవచ్చు. అయితే దేశీయ కార్డులు మాత్రమే ప్రస్తుత నిబంధనలకు లోబడి ఉంటాయి. విదేశీ కార్డ్‌లకు టోకనైజేషన్ వర్తించదు. ►వినియోగదారులు ప్రొడక్ట్స్‌ను కొనుగోలుచేసే సమయంలో షాపింగ్ వెబ్‌సైట్‌కు చెందిన చెక్-అవుట్ పేజీలో కార్డు వివరాలను ఖచ్చితంగా నమోదు చెయ్యాలి. అలాగే టోకనైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. ►ఆన్లైన్లో ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తమ కార్డు సమాచారాన్ని తప్పక సమర్పించాలి. తర్వాత టోకనైజేషన్‌ని ఎంచుకోవాలి. చెల్లింపుల సమయంలో ఇన్‌పుట్‌ని నిర్ధారించడానికి టోకెన్లు సహాయపడతాయి. ►ఈ పద్ధతి ద్వారా ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే.. హ్యాకర్ టోకెన్ నుండి కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం అంత సులభమేమీకాదు. చదవండి: Covid Alert: 70 రెట్లు వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్! నిపుణుల హెచ్చరికలు.. -
ఆన్లైన్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్
న్యూఢిల్లీ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్, మింత్రా.. వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో భారీ డిస్కౌంట్ల కోసం వేచిచూస్తున్నారా? ఈ సారి డిస్కౌంట్ ఆఫర్లో ప్రొడక్ట్‌లు కొనుగోలు చేయాలని ప్లాన్ వేసుకున్నారా? అయితే ఇది మీకు కచ్చితంగా నిరాశ కలిగించే వార్తనే. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు ఆఫర్ చేసే మెగా డిస్కౌంట్ ఆఫర్లకు ఇక త్వరలోనే కళ్లెం పడబోతుంది. భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించి తక్కువ ధరలకు ప్రొడక్ట్‌లను విక్రయించే వాటిపై ఓ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఈ-కామర్స్ పాలసీ ముసాయిదాను కూడా ప్రతిపాదించింది. ఈ ముసాయిదాలో వినియోగదారులను ఆకర్షించేందుకు, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు ఇప్పటివరకు ఇస్తూ వచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్లను నిలిపివేయాల్సి ఉందని ప్రతిపాదించారు. ఈ ముసాయిదా విధానాన్ని సోమవారం స్టేక్‌హోల్డర్స్‌కు కూడా షేర్ చేసింది. ఈ ప్రతిపాదిత చట్టంలోకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ విక్రయ సంస్థలతో పాటు స్విగ్గీ, జొమాటో లాంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ సైట్లు, ఆర్థిక లావాదేవీలు అందించే పేటీఎం, అర్బన్‌క్లాప్, పాలసీ బజార్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు రానున్నాయి. ఈ ముసాయిదా ఈ-కామర్స్ విధానాన్ని కేంద్రం, డేటా ప్రైవసీపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అందించిన ప్రతిపాదనల మేరకు రూపొందించింది. వ్యక్తిగత వివరాల భద్రత బిల్లు- 2018 ముసాయిదాను జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఇందులో వ్యక్తుల కీలక సమాచారాన్ని భారత్‌లో ఉన్న కేంద్రాల్లోనే నిక్షిప్తం చేయాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ-కామర్స్ విధాన ముసాయిదాను కూడా ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగానే రూపొందించినట్లు వాణిజ్య కార్యదర్శి- డిజిగ్నేట్ అనుప్ వాదవాన్ తెలిపారు. ఈ-కామర్స్ విధాన ముసాయిదా రూపకల్పన నిమిత్తం ఓలా, స్నాప్‌డీల్, మేక్ మై ట్రిప్, అర్బన్ క్లాప్, జస్ట్‌డయల్ ప్రతినిధులతో ఓ నిపుణుల కమిటీని కేంద్ర వాణిజ్య శాఖ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారత్ ఈ-కామర్స్ రంగం 25 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఈ దశాబ్దంలో 200 బిలియన్ డాలర్లను తాకనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఈ-కామర్స్ రంగం భారీగా బలపడింది. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు వినియోగదారులను క్యాష్ చేసుకునేందుకు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. దీంతో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు అక్రమ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ.. తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఫిజికల్ రిటైల్ స్టోర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ అమ్మకాల్లో అక్రమ డిస్కౌంట్లకు చెక్ పెట్టడానికి ఇప్పడివరకు ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేదు. కొన్ని బ్రాండులు సైతం తమ ఉత్పత్తులను ఆన్లైన్ సంస్థలు భారీ డిస్కౌంట్ విక్రయిస్తున్నాయని వాపోతున్నాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని భావించిన ప్రభుత్వం, ముసాయిదా ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. -
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
సాక్షి, ఖమ్మంక్రైం : సైబర్ క్రైం–క్రిమినల్స్ ఇతివృత్తంతో ఇటీవల విడుదలైన ‘అభిమన్యుడు’ సినిమాను చూశారా..? సైబర్ నేరాలు జరిగే తీరును ఇది కళ్లకు కట్టినట్లు చూపింది. విద్యావంతులైనా, మేధావులైనా, గొప్పోళ్లయినా.. ఎవరైనా సరే, సైబర్ నేరగాళ్లకు చిక్కి ఎలా మోసపోతారో ఆ సినిమా వివరించింది. ‘‘అది సినిమా..! అలా ఎలా మోసం చేస్తారు? అది సాధ్యమా..?’’ అనుకున్న వాళ్లు కూడా ఉండి ఉంటారు. బయట జరుగుతున్న సైబర్ మోసాలే ఆ సినిమాకు ఇతివృత్తంగా మారాయని మనం నమ్మాల్సిందే. ఎందుకంటే, ఆ సినిమాలో మాదిరిగానే, రెండేళ్ల నుంచి బ్యాంక్ ఖాతాదారుల నెత్తిన టోపీ పెట్టిన–పెడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లే దొంగలు... ఐదుగురితో కూడిన సైబర్ నేరగాళ ముఠాను అరెస్ట్ చేసినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ (సీపీ) తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఆయన శుక్రవారం సీపీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ఉల్లింటి సలీం మాలిక్ అలియాస్ సలీం, నారాయణపల్లి అబ్దుల్, ముద్దనూరు మండలం కొలవలి గ్రామస్తుడు బట్టు రామాంజనేయులు అలియాస్ రాంజీ, మైలవరం మండలానికి చెందిన దండి వేణుగోపాల్ అలియాస్ వేణు, ఇదే మండలంలోని వేపరాళ్ల గ్రామస్తుడు బడిగించాల మనోహర్ కలిసి న్యూఢిల్లీలో రెండేళ్ల క్రితం ‘ఏఏఏ’, ‘న్యూహోమ్’, ‘ఫాస్ట్ అండ్ ఈజీ’ అనే కాల్ సెంటర్లలో టెలీకాలర్స్‌గా పనిచేశారు. అక్కడ వీరి పనేమిటంటే... రోజుకు 100 నుంచి 120 మంది బ్యాంక్ ఖాతాదారులకు ఫోన్ చేయడం. ‘మేము ఫలానా బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. ఈ ఏటీఎం కార్డు అప్డేట్ చేయాలి. ఆధార్ కార్డు లింక్ చేయాలి’ అని చెప్పడం. ఖాతాదారుల ఏటీఎం కార్డు నంబర్, సీవీవీ నంబర్, ఓటీపీ నంబర్ సేకరించడం. వాటిని తమ కాల్ సెంటర్ యజమానికి ఇవ్వడం. తమ యజమానులు చేస్తున్నది ఆన్లైన్ మోసమన్న విషయం వీరికి తెలుసు. సదరు సంస్థ నుంచి వీరికి దండిగానే డబ్బు ముట్టడంతో వీరు విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. మద్యానికి, బెట్టింగ్‌లకు బానిసలయ్యారు. దీంతో డబ్బు సరిపోలేదు. ‘ఎవరి తరఫునో ఎందుకు..? మనమే డైరెక్టుగా జనాలను మోసగించి డబ్బు గడించొచ్చు కదా..’ అనుకున్నారు. ఈ ఐదుగురూ తమ సంస్థల నుంచి బయటపడ్డారు. ముఠాగా ఏర్పడ్డారు. గడించిన అనుభవంతో, రెండేళ్ల క్రితం సైబర్ నేరాలకు దిగారు. ప్రతి మూడు–నాలుగు నెలలోకాసారి సైబర్ నేరాల పద్ధతులు మార్చసాగారు. ఇలా మొదలైంది.. వీరు 2017 ఆగస్టులో నేరాలు మొదలుపెట్టారు. పూర్వం, తమ సంస్థ నుంచి ఎలాగైతే ఫోన్ చేసి వివరాలు సేకరించేవారే, అచ్చం అలాగే చేయసాగారు. ఖాతాదారులకు ఫోన్ చేసి ఏటీఎం, సీవీవీ నంబర్, ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) తెలుసుకునే వారు. వాటి ద్వారా సదరు ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులను తమ అకౌంట్లలోకి మళ్లించేవారు. ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేవారు. ఇలా విలాసవంతమైన జీవితం గడపసాగారు. ఆ సంవత్సరం డిసెంబర్ వరకు ఇలాగే చేశారు. జనవరి 2018లో రూటు మార్చారు. తాము సేకరించిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేసేవారు. పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీల పేర్లు చెప్పి, వాటి కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించేవాళ్లు. ‘లక్కీ డ్రాలో మీ నంబర్ ఎంపికైంది. 25వేల నుంచి 30వేల రూపాయల విలువైన ఫోన్/వస్తువు మీకు కేవలం మూడువేల నుంచి నాలుగువేల రూపాయలకే వస్తుంది. మీ పూర్తి అడ్రస్ చెబితే పంపిస్తాం. డబ్బును మా అకౌంట్లో వేయాలి’ అని, అకౌంట్ నంబర్ ఇచ్చేవాళ్లు. ఏవేవో పనికిరాని వస్తువులను ప్యాక్ చేసి వీపీపీ/సీఓడీ పద్ధతిలో పార్శిల్ పంపేవారు. సదరు చిరునామాదారులు వాటిని చూసుకుని, వాటిని పంపిన సంస్థకు వెంటనే ఫోన్ చేసేవారు. తమ డబ్బు తిరిగిచ్చేయాలని అడిగేవారు. అప్పుడు ఆ సైబర్ మోసగాళ్లు.. ‘సరే, మీ డబ్బును వాపస్ చేస్తాం. మీ ఏటీఎం కార్డ్, సీవీవీ నంబర్ చెప్పండి. కొద్దిసేపటి తరువాత ఓటీపీ నంబర్ మెసేజ్ వస్తుంది. దానిని చూసి చెప్పగానే మీకు డబ్బు వచ్చేస్తుంది’ అని నమ్మించేవారు. సదరు చిరునామాదారులు చెప్పిన ఓటీపీ నంబర్ ఆధారంగా ఈ మోసగాళ్లు తమ మొబైల్ వాలెట్‌లోకి (చిరునామాదారుడి ఖాతాలోని) డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకునేవారు. ఆ తరువాత బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకునేవారు. 2018 మార్చిలో వీరు మరోసారి రూటు మార్చారు. ఈసారి ఇంకో పద్ధతిలో మోసగించడం మొదలెట్టారు. వివిధ రకాల షాషింగ్ వెబ్సైట్లలో మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకునేవారు. దానిని ఏదో ఒక ఫేస్బుక్ అకౌంట్‌కు ఫేక్ లింక్ పంపి, దానిని హ్యాక్ చేసేవారు. ఆ ఫేస్బుక్ ఖాతాదారు ఐడీ, పాస్వర్డ్ తస్కరించేవారు. అతని/ఆమె పేరుతో దగ్గరి మిత్రులతో చాట్ చేసేవారు. ‘ఏటీఎం కార్డు ఫొటో పెడితే డబ్బులు వస్తాయి’ అని నమ్మించేవారు. ఏటీఎం పిక్ ద్వారా కార్డు, సీవీవీ నెంబర్ తెలుసుకునేవారు. ఆ తరువాత ‘వేరే ఫ్రెండ్‌ను ఇన్వైట్ చేస్తే (ఆహ్వానిస్తే) డబ్బులు వస్తాయి’ అని చెప్పి ఓటీపీ నంబర్ కూడా చాటింగ్‌లోనే మెసేజ్ చేయాలని చెప్పేవారు. అలా బ్యాంక్ ఖాతా నుంచి నగదును ఈ నేరగాళ్లు తమ మనీ వాలెట్‌లోకి, అక్కడి నుంచి బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేసుకునేవారు. ఇలా మే నెల వరకు మోసగించారు. ఇలా చిక్కారు... ఇలా వీరి సైబర్ దందా రెండేళ్లపాటు నిరాటంకంగా సాగింది. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ముగ్గురు ఖాతాదారుల నుంచి డబ్బును ఓటీపీ ద్వారా తస్కరించారు. బాధితులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటివే... ఖమ్మం వన్ టౌన్లో రెండు, సత్తుపల్లిలో రెండు, వైరాలో ఒకటి సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. వీటిపై సీపీ తఫ్సీర్ ఇక్బాల్ దృష్టి సారించారు. ఆయన మార్గదర్శకత్వంలో ఖమ్మం ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో ఖమ్మం త్రీ టౌన్ సీఐ వెంకన్నబాబు, సైబర్ క్రైమ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రత్యేక పోలీస్ బృందం తీవ్రంగానే కసరత్తు చేసింది. వెతకగా.. వెతకగా... తీగ దొరికింది. దానిని పట్టుకుని లాగితే.. డొంకంతా కదిలింది. సైబర్ నేరగాళ్ల వివరాలు తెలిశాయి. ఈ ముఠాను వైఎస్సార్ జిల్లాలో, ఢిల్లీలో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ముఠా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బ్యాంక్ ఖాతాదారుల నుంచి దాదాపుగా రూ.4లక్షలకు పైగా కాజేసినట్టు తేలింది. నేరగాళ్ల మనీ వాలెట్ల నుంచి రూ.1,07,000ను బాధితుల అకౌంట్లలోకి తిరిగి జమ చేయించారు. ఈ నేరగాళ్ల నుంచి రూ.1.39లక్షల విలువైన పది సెల్ఫోన్లు, రూ.1.04లక్షల నగదు, 15 సిమ్ కార్డులు స్వాధీనపర్చుకున్నారు. అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించారు. -
ఆన్లైన్ షాపింగా.. జరభద్రం!
సాక్షి, న్యూఢిల్లీ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, మింత్రా, షాప్క్యూస్ లాంటి ఈ కామర్స్ సంస్థలతో ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్న ఉత్పత్తుల్లో ఎక్కువగా నకిలీ ఉత్పత్తులే ఉంటున్నాయని ప్రతి ముగ్గురిలో ఇద్దరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మొబైల్, కంప్యూటర్లలో ఎక్కువగా నకిలీ ఉత్పత్తులు వస్తున్నాయని, ఆ తర్వాత ఫ్యోషన్ ఉత్పత్తులు, ఆ తర్వాత టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఈ మోసం ఎక్కువగా జరుగుతోందని వినియోగదారులు ఆరోపించారు. ముంబైకి చెందిన మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ ‘వెలాసిటీ మిస్టర్’ తమ సర్వేలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలియజేసింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణె నగరాలకు చెందిన దాదాపు మూడువేల మంది ఆన్లైన్ వినియోగదారుల అభిప్రాయలను ఏప్రిల్ మొదటి వారంలో సేకరించడ ద్వారా ఈ సర్వేను నిర్వహించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో జషల్ షా తెలియజేశారు. అవకతవకలు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ కామర్స్ మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నప్పటికీ ఇలా నకిలీ సరుకులు వెల్లువెత్తడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మకం దారే ఒరిజనల్ అంటూ నకిలీ సరకులను సరఫరా చేస్తే తామేమి చేయలేమని, మార్గమధ్యంలో సరకులు మారకుండా మాత్రమే తాము కట్టడి చేయగలమని ఈ కామర్స్ సంస్థలు తెలియజేస్తున్నాయి. తమ వ్యాపారం నమ్మకంపైకే ఎక్కువగా ఆధారపడి ఉన్నందున ఆ నమ్మకం వమ్ముకాకుండా ఉండేందుకే ఎక్కువ కృషి చేస్తామని ఆ కంపెనీలు చెబుతున్నాయి. 2026 నాటికి 20.000 కోట్ల రూపాయలకు ఈ కామర్స్ వ్యాపారం చేరుకుంటుందని అంచనా వేస్తున్న సమయంలో నకిలీ ఉత్పత్తులు పెరిగిపోవడం నిజంగా విచారకరమే. నకిలీ ఉత్పత్తులను గమనించి వాటిని తిప్పి పంపితే, డబ్బు వెనక్కి వస్తున్న సందర్భాలు చాలా తక్కువని, నకిలీ స్థానంలో మరో ఉత్పత్తిని తీసుకోవడమే ఎక్కువ సార్లు జరుగుతోందని వినియోగదారులు చెబుతున్నారు. ఒరిజనల్ కన్నా తక్కువ ధరకు వస్తే నకిలీ ఉత్పత్తులనైనా తీసుకునేందుకు తాము సిద్ధమేనని ప్రతి నలుగురిలో ఒకరు చెబుతుండగా, ఒరిజనల్‌తో సమానమైన నాణ్యత కలిగి ఉన్నట్లయితే వాటిని తీసుకునేందుకు తాము సిద్ధమని 20 శాతం మంది వినియోగదారులు చెప్పారు. -
క్లిక్ కొట్టు..సరుకులు పట్టు
వైరా : ఆధునిక కాలం..అందుబాటులో టెక్నాలజీ..ఇంటర్నెట్ సౌకర్యంతో ఆన్లైన్ షాపింగ్ క్రమంగా విస్తరిస్తోంది. గతంలో నగరాలు, పట్టణాల నుంచే ఆన్లైన్లో వివిధ రకాల వస్తువులను ఆర్డర్ చేయగా..ఇటీవల కాలంలో గ్రామాలనుంచి కూడా బుకింగ్‌లు పెరుగుతున్నాయి. పలు కంపెనీలు ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా తీరొక్క వస్తువులను విక్రయిస్తుండగా..కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ల ద్వారా కావాల్సినవాటిని కొనుగోలు చేస్తున్నారు. చిరునామా, ఫోన్ నంబర్‌ను యాప్ ద్వారా నమోదు చేసుకుంటే..రెండు, మూడు రోజుల్లో ఆ వస్తువు ఇంటికి చేరుతుంది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల హవా కొనసాగుతుండటంతో అరచేతిలోనే షాపింగ్ జరుగుతోంది. దీనిపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి కనబరుస్తుండటంతో ఆన్లైన్ షాపింగ్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి మండల కేంద్రంలో డెలవరీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వినియోగదారులకు వస్తువులను చేరవేస్తున్నారు. తీరొక్క వస్తువులు.. ఆన్లైన్ షాపింగ్‌లో ఎలక్ట్రికల్, పురుషులు, మహిళలకు సంబంధించిన దుస్తులు, ఎలక్ట్రానిక్స్, సెల్ఫోన్లు, ఇతరత్రా సామగ్రి, షూస్, చెప్పులు, గృహోపకరణాలు, గ్రంథాలు..ఇలా అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ఫోన్లలో నచ్చిన షాపింగ్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునే వీలుంది. ఆప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో నచ్చిన వస్తువులను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఒక ఫాం వస్తుంది. అందులో పూర్తి చిరునామా, సెల్‌నంబర్, మెయిల్ ఐడీ ఫిల్ చేసి సెండ్ చేయాలి. వినియోగదారులు డబ్బులు చెల్లించేందుకు నాలుగు పద్ధతులున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ, డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు చెల్లించవచ్చు. నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని దాని ప్రకారం చెల్లిస్తే సరిపోతుంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఎంపిక చేసుకున్న వస్తువు ఇంటికి చేరిన తర్వాత కొరియర్ బాయ్‌కి క్యాష్ చెల్లించాల్సి ఉంటుంది. నచ్చకపోతే వెనక్కి.. ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొనుగోలు చేసిన వస్తువు నచ్చకపోతే తిరిగి 15రోజుల్లోపు వెనక్కి పంపించవచ్చు. మొదట ఆన్లైన్లో కస్టమర్‌కేర్‌కు కాల్చేస్తే వారు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఆ డబ్బులను తిరిగి వినియోగదారుడికి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ఆన్లైన్ షాపింగ్‌లో కొన్ని కంపెనీలు రోజుకో ఆఫర్లు ప్రకటిస్తూ ఆకర్షిçస్తున్నాయి. జర భద్రం.. కొన్ని నకిలీసైట్లు ఆకర్షిస్తుంటాయి వాటిలో నమోదు చేసుకోవద్దు తయారీ సంస్థ నుంచి నేరుగా బిల్లులు లేకపోవడం లోపం సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉండవు ముఖాముఖి లావాదేవీలు లేక గ్యారంటీ కరువు వారంటీ విషయంలో స్పష్టత లేదు ముందస్తు చెల్లింపుల తర్వాత తీవ్రజాప్యం కొన్ని సందర్భాల్లో అసలు వస్తువులే రావట్లే పేరెన్నిక గల కంపెనీల వస్తువులు కొనడం ఉత్తమం -
ఈ-కామర్స్ సైట్స్‌కే టోకరా
♦ ఆన్లైన్లో ఆర్డర్లు ఇస్తూ దర్జాగా చోరీలు ♦ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లను దోపిడీ చేసిన చోర సోదరులు ♦ అరెస్టు చేసిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ సైట్స్‌లో ఆర్డర్లు ఇవ్వడం.. వస్తువులకు బదులు రాళ్లు, సబ్బుబిళ్లలు పొంది మోసపోవడం.. ఈ తరహా నేరాలను మనం వింటూనే ఉన్నాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లకే టోకరా వేశారు ఇద్దరు చోర సోదరులు. చివరకు ఫ్లిప్‌కార్ట్ సంస్థ గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిద్దరినీ బుధవారం అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇషాకీ, మహ్మద్ షర్ఫరోజ్ అన్సారీ వరుసకు సోదరులు. కుటుంబంతో నగరానికి వలస వచ్చిన ఈ ద్వయం గోల్కొండ ఠాణా పరిధిలోని ధన్కోట ప్రాంతంలో నివసిస్తోంది. ఇషాకీ జూబ్లీహిల్స్‌లోని ఇగ్నోలో సైకాలజీ చదువుతుండగా.. అన్సారీ జవహర్‌నగర్‌లోని కళాశాలలో బీబీఏ అభ్యసిస్తున్నాడు. ఇషాకీ అమేజాన్ వెబ్సైట్లో పుస్తకాల విక్రేతగా రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ ఆర్డర్స్‌పై కొన్ని రకాలైన పుస్తకాలను విక్రయిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయా ఈ-కామర్స్ సంస్థలు వస్తువుల్ని ప్యాక్ చేసే విధానం, చెల్లింపులపై పూర్తి అవగాహన ఉండటంతో అన్సారీతో కలసి ఆన్లైన్ సైట్స్‌ను మోసం చేయాలని కుట్ర పన్నాడు. వస్తువులు తీసి ఇసుక నింపి.. ఈ ద్వయం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్స్‌లో క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, కెమెరాలు, డీవీడీ ప్లేయర్లను ఆర్డర్ చేసేది. ఆయా వస్తువుల్ని తీసుకువచ్చిన డెలివరీ బాయ్స్‌ను గోల్కొండలోని తన ఇంటి వద్దే కలిసేది. వారి నుంచి పార్శిల్‌ను తీసుకునే ఇషాకీ.. నగదు చెల్లించేందుకు డెబిట్ కార్డ్ తీసుకువస్తానంటూ లోపలికి వెళ్లేవాడు. డెలివరీ బాయ్‌కు అనుమానం రాకుండా ఉండేందుకు అన్సారీ అక్కడే ఉండి అతడితో మాటలు కలిపేవాడు. ఇంట్లోకి వెళ్లిన ఇషాకీ.. చాకచక్యంగా పార్శిల్‌ను తెరిచి అందులోని వస్తువు తీసేసేవాడు. ఆ వస్తువుకు సమాన బరువు ఉండే ఇసుకను ప్యాక్ చేసి బాక్సులో ఉంచేవాడు. సీలింగ్ మిషన్ సాయంతో సీలు వేసే వాడు. ‘డమ్మీ’ డెబిట్‌కార్డ్ తీసుకువచ్చి.. అలా రీ-ప్యాక్ చేసిన ‘విలువైన వస్తువు’లతో పాటు బ్యాలెన్స్ లేని డెబిట్ కార్డును తీసుకుని బయటకు వచ్చే ఇషాకీ.. కార్డును డెలివరీ బాయ్‌కు ఇచ్చేవాడు. స్వైపింగ్ మిషన్‌లో స్వైప్ చేసిన డెలివరీ బాయ్స్ అందులో బ్యాలెన్స్ లేదని చెప్పేవారు. దీంతో ‘సారీ’ చెప్పేసి.. అన్సారీ పార్శిల్‌ను తిరిగి వారికి అప్పగించేసేవాడు. ఈ పంథాలో ఫ్లిప్‌కార్ట్‌ను ఎనిమిదిసార్లు మోసం చేశారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి కాజేసిన మూడు ఖరీదైన సెల్ఫోన్లు, ఓ కెమెరా, ల్యాప్‌టాప్, డీవీడీ ప్లేయర్‌ను నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలోనే రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధి నుంచి ఓ ద్విచక్ర వాహనాన్నీ చోరీ చేసినట్లు తెలియడంతో దాన్నీ రికవరీ చేశారు. తాము అమేజాన్‌నూ ఇదే తరహాలో మోసం చేశామని నిందితులు వెల్లడించారు. ఆ సంస్థ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఎన్నికల హడావిడి