కేజీఎఫ్ నటుడు కృష్ణ జి. రావు కన్నుమూశారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం నాడు బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కేజీఎఫ్ మొదటి భాగంలో విలన్లను హీరో యశ్ చితక్కొట్టే ఫైట్ సన్నివేశానికి ముందు ఈ తాత అంధుడిగా కనిపిస్తారు. ఆ సన్నివేశంతో రాఖీభాయ్ పవరేంటో అందరికీ తెలిసొస్తుంది. కేజీఎఫ్ సినిమాల్లో ఆయన నిడివి తక్కువే అయినప్పటికీ ఈ మూవీలు సూపర్ హిట్ కావడంతో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి ఆయన్ను వెతుక్కుంటూ సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో కృష్ణ ప్రధాన పాత్రలో ఇటీవలే ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఇంతలోనే ఆయన తుది శ్వాస విడిచారు.
కాగా కృష్ణ జి రావు అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్, కథా రచయితగా.. ఇలా చాలా పనులు చేశారు. ఇలాంటి సమయంలో ప్రొవిజనల్ మేనేజర్ కుమార్.. కేజీఎఫ్ సినిమా కోసం ఫొటో పంపించమని కృష్ణని కోరారు. కానీ ఆయన స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉండటంతో నటన తనకెందుకులే అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ ఓ రోజు కుమార్ స్వయంగా కృష్ణ ఫొటోను కేజీఎఫ్ ఆడిషన్స్‌కు పంపారు. దీంతో ఆయన కేజీఎఫ్ సినిమాకు సెలక్ట్ అయ్యారు.
చదవండి: మాజీ బాయ్‌ఫ్రెండ్ నన్ను చితక్కొట్టాడు, చంపేందుకు ప్రయత్నించాడు: నటి
సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment