KGF Actor Harish Roy Battling With Cancer - Sakshi
Sakshi News home page

Harish Roy: సినిమా ఛాన్సులు రావేమోనని క్యాన్సర్‌ ఉందని చెప్పలేదు

Published Fri, Aug 26 2022 2:37 PM | Last Updated on Fri, Aug 26 2022 7:35 PM

KGF Actor Harish Roy Battling With Cancer - Sakshi

ప్రముఖ కన్నడ నటుడు హరీశ్‌ రాయ్‌ కేజీఎఫ్‌ సినిమాలో ఖాసిం చాచాగా నటించి సౌత్‌ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పలువురు దక్షిణాది హీరోలతోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఆయన గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ క్యాన్సర్‌ నాలుగో దశలో ఉంది. తనకు క్యాన్సర్‌ సోకిన విషయాన్ని హరీశ్‌ రాయ్‌ మొదట గుట్టుగా దాచాడు. ఈ విషయం బయటకు చెప్తే తనకు సినిమా ఛాన్సులు రావేమోనన్న భయంతో దాన్ని గోప్యంగా ఉంచాడు. కానీ, తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాడు.

'కొన్ని పరిస్థితులు మనకు అద్భుతాన్ని అందించవచ్చు, లేదంటే మనదగ్గర ఉన్నదాన్ని కూడా పోగొట్టేలా చేయవచ్చు. విధి నుంచి మనం తప్పించుకునే ఛాన్సే లేదు. నేను మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. దీనివల్ల మెడ దగ్గర వాచిపోయింది. నా దగ్గర డబ్బు లేకపోవడంతో శస్త్ర చికిత్స వాయిదా వేసుకున్నాను. ఆ సమయంలో కేజీఎఫ్‌లో నటించే అవకాశం రావడంతో పెద్ద గడ్డంతో నా వాపు కనిపించకుండా కవర్‌ చేసుకున్నాను. నేను నటించిన సినిమాలు రిలీజయ్యేవరకు ఈ విషయం చెప్పకూడదనుకున్నాను'

'ఇప్పుడు క్యాన్సర్‌ నాలుగో స్టేజీలో ఉంది. పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఓసారైతే క్లైమాక్స్‌లోని ఓ సీన్‌లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైంది' అని తన దీనగాథను చెప్పుకొచ్చాడీ నటుడు. ఒకసారి తన చికిత్స కోసం డబ్బులు కావాలని కోరుతూ ఓ వీడియో చేసినప్పటికీ దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేందుకు ధైర్యం చాల్లేదన్నాడు హరీశ్‌. ఇప్పుడతడికి క్యాన్సర్‌ ఉందన్న విషయం బహిర్గతం కావడంతో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారట!

చదవండి: మారుతి, ప్రభాస్‌ సినిమా షురూ.. టైటిల్‌ ఇదేనా?
రజనీకాంత్‌తో సినిమా.. రాజమౌళి స్టేట్‌మెంట్, ‘ఆర్‌ఆర్‌’కి చాన్స్‌ ఉందా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement