KGF 2 Fame Archana Jois Gets Felicitation In Kolar - Sakshi
Sakshi News home page

KGF 2 Fame Archana Jois: కేజీఎఫ్‌ 2 నటి అర్చనా జోయిస్‌కు సన్మానం

Published Thu, Apr 21 2022 9:05 AM | Last Updated on Thu, Apr 21 2022 11:26 AM

KGF 2 Fame Archana Jois Gets Felicitation In Kolar - Sakshi

సాక్షి, కోలారు (కర్ణాటక): కేజీఎఫ్‌ సినిమాలో నటించిన కోలారుకు చెందిన నటి అర్చనా జోయిస్‌ను బుధవారం నగరంలోని సపలమ్మ దేవాలయ సమితి ఘనంగా సన్మానించింది. నగరసభ సభ్యుడు మురళీగౌడ మాట్లాడుతూ అర్చనా జోయిస్‌ తన నటన ద్వారా జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో కార్తీక్, సత్యనారాయణ, నవీన్‌బాబు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న రిలీజైన కేజీఎఫ్‌ బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు తిరగరాస్తోంది. 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూళ్లు చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాఖీభాయ్‌ యశ్‌ కథానాయకుడిగా సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా నటించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు.

చదవండి: 'కేజీఎఫ్‌ 2' మేనియా.. పెళ్లి శుభలేఖపై 'వయలెన్స్‌' డైలాగ్‌

రాకీభాయ్‌ ఊచకోత.. ‘కేజీయఫ్‌ 2’ కలెక్షన్స్‌ ఎంతంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement